నా బాల్యం గుర్తొచ్చింది..
ABN , Publish Date - Mar 04 , 2024 | 12:29 AM
రాజమహేంద్రవరం షిర్డిసాయి విద్యాసంస్థల ఆధ్వర్యంలో క్రీడోత్సవ్ పేరుతో నిర్వహించిన వార్షిక క్రీడా, సాంస్కృ
షిర్డీసాయి క్రీడోత్సవ్‌లో నటుడు సాయికుమార్
రాజమహేంద్రవరం రూరల్/దివాన్‌చెరువు, మార్చి 3: రాజమహేంద్రవరం షిర్డిసాయి విద్యాసంస్థల ఆధ్వర్యంలో క్రీడోత్సవ్ పేరుతో నిర్వహించిన వార్షిక క్రీడా, సాంస్కృతిక కార్యక్రమం దివాన్‌చెరువు షిర్డిసాయి విద్యాప్రాంగణంలో ఘనంగా జరిగింది. దీనికి భారత షూటర్ ఈషాసింగ్, నౌకాదళ లెఫ్ట్‌నెంట్ కమాండర్ పి.స్వాతి, నటుడు సాయికుమార్ ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. షిర్డిసాయి విద్యానికేతన్ వ్యవస్థాపకుడు తంబాబత్తుల పాలేశ్వరరావు సతీమణి నాగమణి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈషాసింగ్ మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణించాలంటే కృషి, పట్టుదల అవసరమన్నారు. సాయికుమార్ మాట్లాడుతూ మార్చ్‌ఫాస్ట్ డ్రిల్ చూస్తున్నపుడు తన బాల్యం గుర్తుకు వచ్చిందని, తాను కూడా ఎన్‌సీసీ విద్యార్థినే అన్నారు. స్వాతి మాట్లాడుతూ పిల్లల అభివృద్ధిలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపాత్ర కీలకమన్నారు. తన స్వీయ అనుభవాలను వివరించారు. విద్యార్థుల ప్రదర్శనలు, సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో షిర్డిసాయి విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్, డైరెక్టర్ టి.శ్రీవిద్య, టి.శ్రీలేఖ, ఉపాధ్యాయులు,