Share News

నేటి నుంచి మున్సిపాల్టీల్లో అన్ని పనులు బంద్‌

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:48 AM

పారిశుధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో మున్సిపల్‌ అత్యవసర విభాగాల కార్మికులను కలుపుకుని బుధవారం నుంచి మున్సిపాల్టీలలో అన్ని పనులు బంద్‌ చేస్తామని మున్సిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు తెలిపారు.

నేటి నుంచి మున్సిపాల్టీల్లో అన్ని పనులు బంద్‌

  • మున్సిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు

కొవ్వూరు, జనవరి 2: పారిశుధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో మున్సిపల్‌ అత్యవసర విభాగాల కార్మికులను కలుపుకుని బుధవారం నుంచి మున్సిపాల్టీలలో అన్ని పనులు బంద్‌ చేస్తామని మున్సిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు తెలిపారు. వారు మంగళవారం కొవ్వూరు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట 8వ రోజు నిరవధిక సమ్మెను చేపట్టారు. కార్మిక సంఘ నాయకులు రాజాన అప్పారావు, మీసాల కిషోర్‌ మాట్లాడుతూ ప్రజలకు కలిగే అసౌకర్యానికి ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమం లో పూజారి వాసు, భూపతి రవీంద్ర, కళ్యాణి రాజేష్‌, మీసాల ప్రేమ్‌, ఎం.జ్యోతి, కె.ప్రసాద్‌ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.సుందరబాబు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 12:48 AM