Share News

మునిసిపల్‌ ఆర్‌డీగా నాగ నరసింహరావు బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Jun 02 , 2024 | 01:35 AM

రాజమహేంద్రవరం మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ రీజనల్‌ డైరెక్టర్‌గా సీహెచ్‌. నాగనరసింహరావు నియమితులయ్యారు.

మునిసిపల్‌ ఆర్‌డీగా  నాగ నరసింహరావు బాధ్యతల స్వీకరణ

రాజమహేంద్రవరం సిటీ/కార్పొరేషన్‌(కాకినాడ), జూన్‌ 1 : రాజమహేంద్రవరం మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ రీజనల్‌ డైరెక్టర్‌గా సీహెచ్‌. నాగనరసింహరావు నియమితులయ్యారు. మునిసిపల్‌ ఆర్‌డీగా పనిచేసిన నాగళ్ళ వీరవెంకట సత్యనారాయణ పదవీ విరమణ కావడంతో ఆయన స్థానంలో కాకినాడ నగరపాలక సంస్థ అడిషనల్‌ కమిషనర్‌ సీహెచ్‌.నాగన రసింహరావును ఆర్‌డీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్టుమెంట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం రాజమహేంద్రవరం మునిసిపల్‌ ఆర్‌డీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. 1999 గ్రూప్‌-2 బ్యాచ్‌కు చెందిన నాగ నరసింహరావు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో భీమవరం, పాలకొల్లు, కొవ్వూరు, నరసాపురం మునిసిపాలిటీలకు కమిషనర్‌గా సేవలందించారు. కాకినాడ నగరపాలక సంస్థ అడిషనల్‌ కమిషనర్‌గా పనిచేస్తూ పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఆర్‌డీ నాగనరసింహరావు మాట్లాడుతూ రాజమహేంద్రవరం మునిసిపల్‌ ఆర్‌డీగా అంకితభావంతో సేవలంది స్తానన్నారు. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్‌టీఆర్‌ జిల్లాల పరిధిలో 34 మునిసిపాలిటీలు తన పరిధిలో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సమర్థవంతంగా పనిచేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా పలు మునిసిపాలిటీలకు చెందిన కమిషనర్లు, అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. ఏపీ మున్సిపల్‌ కమిషనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బాలస్వామి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.ఏసుబాబు, సిబ్బంది అభినందించారు.

Updated Date - Jun 02 , 2024 | 08:39 AM