దళితవాడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Jul 12 , 2024 | 11:57 PM
తాళ్లరేవు, జూలై 12: దళితవాడల అభివృద్ధికి టీడీపీ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ పేర్కొన్నారు. తాళ్లరేవు మండల ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు మోర్త భైరవమూర్తి, జక్కల ప్రసాద్‌బాబుల ఆధ్వర్యంలో శుక్ర వారం జరిగిన సన్మానసభలో ఎమ్మెల్యే మాట్లాడు తూ ఎస్సీలు టీడీపీకి 60శాతం ఓట్లువేసి భారీ మోజార్టీతో గెలిపించారని, వారి రుణం ఏమిచ్చితీర్చుకున్నా తీరనిద
ఎమ్మెల్యే బుచ్చిబాబు, ఎంపీ హరీష్ మాధుర్
తాళ్లరేవు, జూలై 12: దళితవాడల అభివృద్ధికి టీడీపీ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ పేర్కొన్నారు. తాళ్లరేవు మండల ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు మోర్త భైరవమూర్తి, జక్కల ప్రసాద్‌బాబుల ఆధ్వర్యంలో శుక్ర వారం జరిగిన సన్మానసభలో ఎమ్మెల్యే మాట్లాడు తూ ఎస్సీలు టీడీపీకి 60శాతం ఓట్లువేసి భారీ మోజార్టీతో గెలిపించారని, వారి రుణం ఏమిచ్చితీర్చుకున్నా తీరనిదన్నారు. ఎస్పీ గ్రామాల్లో సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఎంపీ మాట్లాడుతూ తన తండ్రి బాలయోగి తలపెట్టిన అభివృద్ధిని పునరుద్ధరించి కోనసీమకు రైల్వేకూతను వినిపిస్తానన్నారు. పార్లమెంటు పరిధిలోని దళి త గ్రామాల్లో డ్రైనేజీలు, రోడ్లు, కమ్యూనిటీహాల్స్ తా గునీరు, వైద్యం వంటి సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, టేకుమూడి లక్ష్మణరావు, మందాల గంగసూర్యనారాయణ, ధూళిపూడి వెంకటరమణ, చెల్లి అశోక్‌కుమార్, వాడ్రేవు వీరబాబు, పొన్నమండ రామలక్ష్మి, పెమ్మాడి కృష్ణవేణి ఉన్నారు.
విజయోత్సవ ర్యాలీ
తాళ్లరేవు మండల టీడీపీ ఎస్పీ సెల్ విభాగం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బుచ్చిబాబు, ఎంపీ హరీష్‌మాధుర్‌కు శుక్రవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించా రు. పోలేకుర్రు వైజంక్షన్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీకి ఘన స్వాగతం పలికి గుర్రాల రథంపై ఊరేగించుకుంటూ బైక్ ర్యాలీని గుడ్డువానితూము సెంటరు వ రకు నిర్వహించారు. అడుగడుగునా అంబేడ్కర్ విగ్రహాలకు ఎమ్మెల్యే, ఎంపీలు పూలమాలలతో నివాళు లర్పించారు. దళితనేతలు దున్నా సుబ్రహ్మణ్యం, వెంటపల్లి చంద్రమౌళి, సబ్బతి శ్రీనివాస్, గుండుపల్లి శ్రీను, మేడపాటి దేవానందం, వడ్డి విజయకుమార్, బోయిడి వేణుగోపాల్, బీర మాలయ్య పాల్గొన్నారు.