Share News

ఎంటీఎస్‌ ఉపాధ్యాయులను రెగ్యులర్‌ చేయాలి

ABN , Publish Date - Nov 25 , 2024 | 12:52 AM

మినీమం టైమ్‌స్కేల్‌ (ఎంటీఎస్‌) ఉపాధ్యాయులను రెగ్యులర్‌ చేసి ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని కోరుతూ ఎంటీఎస్‌ ఫెడరేషన్‌ ఉమ్మడి జిల్లా శాఖ అధ్యక్షుడు చొల్లంగి కేశవకుమార్‌ ఆధ్వర్యంలో ఆదివారం అమలాపురంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు వినతిపత్రం అందజేశారు.

ఎంటీఎస్‌ ఉపాధ్యాయులను రెగ్యులర్‌ చేయాలి

అమలాపురం టౌన్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): మినీమం టైమ్‌స్కేల్‌ (ఎంటీఎస్‌) ఉపాధ్యాయులను రెగ్యులర్‌ చేసి ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని కోరుతూ ఎంటీఎస్‌ ఫెడరేషన్‌ ఉమ్మడి జిల్లా శాఖ అధ్యక్షుడు చొల్లంగి కేశవకుమార్‌ ఆధ్వర్యంలో ఆదివారం అమలాపురంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు వినతిపత్రం అందజేశారు. కనీస పెన్షన్‌ సదుపాయం కల్పించాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్తానని సుభాష్‌ హామీ ఇచ్చారు. కడలినాగరాజు, బొంతు శ్రీనివాస్‌, బండి రమణకుమార్‌, గుత్తుల వెంకటేశ్వరరావు, దొమ్మేటి నాగేశ్వరరావు, చెల్లుబోయిన శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 12:52 AM