బిక్కవోలు ఎంపీపీ జ్యోతిర్మయి రాజీనామా
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:59 AM
క్కవోలు ఎంపీపీ కొవ్వూరి జ్యోతిర్మయిశేషుకుమారి తన ఎంపీపీ పదవికి రాజీనామా చేశారు.

బిక్కవోలు, జూలై 4 : బిక్కవోలు ఎంపీపీ కొవ్వూరి జ్యోతిర్మయిశేషుకుమారి తన ఎంపీపీ పదవికి రాజీనామా చేశారు. కొమరిపాలెం-2 ఎంపీటీసీగా ఎన్నికైన జ్యోతిర్మయిని ఎంపీటీసీ సభ్యులందరూ ఎంపీపీగా ఎన్నుకున్నారు. అయితే ఆమె వ్యక్తిగత కారణాల వల్ల మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ ఈ నెల 3న జిల్లా పరిషత్ సీఈవోకు రాజీనామా లేఖను పంపడంతో వెంటనే ఆమోదించారు. తాత్కాలిక ఎంపీపీగా బిక్కవోలుకు చెందిన వైస్ ఎంపీపీ బుద్దాల కన్నారావును కొత్త ఎంపీపీగా ఎన్నుకునే వరకూ కొనసాగాలంటూ సీఈవో నుంచి గురువారం తమకు ఉత్తర్వులు వచ్చాయని ఎంపీడీవో వి. విజయలక్ష్మి తెలిపారు. ఇకపై జ్యోతిర్మయి ఎంపీటీసీ సభ్యురాలిగా కొనసాగుతారన్నారు. సీఈవో ఆదేశాల మేరకు త్వరలో ఎంపీపీ ఎన్నిక నిర్వహిస్తామని ఆమె వివరించారు. ఈ నెల 12న ఎంపీపీ బుద్దాల కన్నారావు అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని ఎంపీడీవో తెలిపారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరవుతారన్నారు.