Share News

చిన్నమ్మ దూకుడు

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:51 AM

ఎన్‌టీఆర్‌ కుమార్తె ఎక్కడా తగ్గలేదు.. కౌంటింగ్‌ ఆరంభం నుంచి దూసుకుపోయారు.. రౌండ్‌ రౌండ్‌కు మెజార్జీ పెంచుకుంటూపోయారు. కూటమి అభ్యర్థి చిన్నమ్మ దూకుడుకు లోక్‌సభ బరిలో నిలిచిన మిగిలిన 11 మంది అభ్యర్థులు ఇంటిబాట పట్టారు.

చిన్నమ్మ దూకుడు
ఆనందం పంచుకున్నారు : రాజమండ్రి ఎంపీ విజేతగా నిలిచిన తల్లి దగ్గుబాటి పురందేశ్వరికి స్వీటు తినిపిస్తున్న కుమార్తె, కుమారుడు (ఫైల్‌)

ఏడు అసెంబ్లీల్లో ఆదరణ

ప్రతి దశలోనూ పైచేయి

ఎన్‌టీఆర్‌ కుమార్తెగా గుర్తింపు

అఖండ విజయం సాధింపు

55.38 శాతం ఓట్లు

రాజమహేంద్రవరం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఎన్‌టీఆర్‌ కుమార్తె ఎక్కడా తగ్గలేదు.. కౌంటింగ్‌ ఆరంభం నుంచి దూసుకుపోయారు.. రౌండ్‌ రౌండ్‌కు మెజార్జీ పెంచుకుంటూపోయారు. కూటమి అభ్యర్థి చిన్నమ్మ దూకుడుకు లోక్‌సభ బరిలో నిలిచిన మిగిలిన 11 మంది అభ్యర్థులు ఇంటిబాట పట్టారు. లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధానం ఇద్దరి మధ్యే పోటీ జరిగింది. కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి తలపడగా ప్రత్యర్థిగా వైసీపీ నుంచి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ బరిలో నిలిచారు. రాజమ హేంద్రవరం ఎంపీ విజేతగా అత్యధిక మెజా ర్జీతో గెలుపొందిన దగ్గుబాటి పురందేశ్వరి పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ఏడు శాసన సభ స్థానాల్లో ఎక్కడా తగ్గలేదు. అన్ని సెగ్మెంట్లలో స్పష్టమైన మెజార్టీతో ప్రజలు ఆద రించారు. రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌లో కలిపి 3,80,197 మంది ఓటు వేయగా వారిలో సగానికిపైగా అంటే 2,30,909(60.73 శాతం) మంది ఆమెకు ఓటేశారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని 237 పోలింగ్‌ స్టేషన్లలో మొత్తం 13,11,751 ఓట్లు పోల్‌ కాగా 7,26,515 (55.38 శాతం) ఓటర్లు ఆమెను ఆదరించారు. 2014లో తన సమీప అభ్యర్థి బొడ్డు వెంకట రమణ చౌదరి(వైసీపీ)పై మాగంటి మురళీ మోహన్‌ (టీడీపీ) 1,67,434 ఓట్లతో విజయం సాధిం చారు. 2019లో మాగంటి రూప(టీడీపీ)పై మార్గాని భరత్‌ రామ్‌(వైసీపీ) 1,21,634 ఓట్లు సాధించారు. వాటన్నింటినీ పురందేశ్వరి తుడిచి పెట్టేశారు.సమీప ప్రత్యర్థి గూడూరి శ్రీనివాస్‌పై 2,39,139 ఓట్ల ఆధిక్యం సాధించారు. పార్లమెం ట్‌ నియోజకవర్గంలో మొత్తం 1577 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా అత్యధికంగా కొవ్వూరు నియోజకవర్గంలోని 171వ నెంబరు పోలింగ్‌ స్టేషన్‌లో 978 ఓట్లు పురందేశ్వరి సాధించారు.

శాసన సభ స్థానాల వారీగా

అసెంబ్లీ డి.పురందేశ్వరి జి.శ్రీనివాస్‌ వ్యత్యాసం

అనపర్తి 107752 77984 29768

రాజానగరం 97157 66977 30180

రాజమండ్రి 113284 52074 61210

రూరల్‌ 117625 66556 51069

కొవ్వూరు 83627 61834 21793

నిడదవోలు 95597 69599 25998

గోపాలపురం 103599 88148 15541

పోస్టల్‌ 7874 4204 3670

మొత్తం 7,26,515 4,87,376 2,39,139

రాజానగరం(216)

స్టేషన్‌ ఓట్లు

153 898

122 849

171 814

209 762

154 759

అనపర్తి(228)

స్టేషన్‌ ఓట్లు

166 780

204 740

27 710

53 697

115 691

రాజమండ్రి (237)

స్టేషన్‌ ఓట్లు

38 765

170 744

217 729

76 723

56 710

రూరల్‌ (267)

స్టేషన్‌ ఓట్లు

43 817

219 780

195 743

203 729

106 720

కొవ్వూరు (176)

స్టేషన్‌ ఓట్లు

171 978

99 878

112 821

148 818

062 805

నిడదవోలు (205)

స్టేషన్‌ ఓట్లు

135 839

164 794

128 786

77 777

6 776

గోపాలపురం(248)

స్టేషన్‌ ఓట్లు

203 768

61 717

153 692

152 690

17 653

Updated Date - Jun 07 , 2024 | 12:51 AM