Share News

యువత ఉపాధికి స్కిల్‌ శిక్షణ

ABN , Publish Date - Oct 27 , 2024 | 12:54 AM

యువతకు ఉపాధి కల్పించాలన్న దే ప్రధాన లక్ష్యమని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు.

యువత ఉపాధికి స్కిల్‌ శిక్షణ
జాబ్‌మేళాను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చిత్రంలో బీవీఆర్‌ చౌదరి, ప్రిన్సిపాల్‌ రామచంద్ర టీడీపీ నాయకులు

1500 మందికి ఉద్యోగాలు

రాజమహేంద్రవరంసిటీ, అక్టో బరు 26 (ఆంధ్రజ్యోతి) : యువతకు ఉపాధి కల్పించాలన్న దే ప్రధాన లక్ష్యమని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. నగర ప్రజలకు ఇచ్చిన డిక్లరేషన్‌లో ప్రధానమైన ఉద్యోగ,ఉపాధి స్కీమ్‌లో భాగంగా తన సొంత ఖర్చులతో 80 కంపెనీలను రప్పించి ఆర్ట్స్‌కళాశాలలో శనివారం జాబ్‌ వేళా ఏర్పాటు చేశా రు. వేలాదిగా నిరుద్యోగులు తరలివచ్చారు.తొలుత జాబ్‌మేళా ప్రారంభిం చారు. ఇంటర్వ్యూ లు నిర్వహించగా 1500 మందికి ఉద్యోగాలు వచ్చాయి.. ఆఫర్‌ లెటర్స్‌ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అందించి మాట్లాడారు.యువత గత ఐదేళ్లుగా ఎటువంటి ఉద్యోగా వకాశాలు లేక తీవ్ర ఇబ్బం దులు పడ్డారని చెప్పారు. తన పుట్టిన రోజున ఒక మంచి కార్యక్రమాన్ని తలంచి తన సొంత ఖర్చులతో 80 కంపెనీలతో మెగా జాబ్‌ మేళా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.అమరావతి సొల్యూషన్స్‌.. భవాని చారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్తంగా ప్రతి మూడు నెలలకు వంద మంది నిరుద్యోగులకు సాఫ్ట్‌వేర్‌లో స్కిల్స్‌ శిక్షణ ఇస్తామన్నారు. ఒక్కో అభ్యర్థికి రూ.20 వేలు ఖర్చవుతుందని అందులో రూ.15 వేలు ఫీజు భవానీ చారిటబుల్‌ ట్రస్టు భరిస్తుందని అభ్యర్థి రూ.5 వేలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. స్కిల్స్‌ పెంచుకుంటే అవకాశాలు వస్తాయన్నా రు. కార్యక్రమంలో ఆర్‌డీవో కృష్ణనాయక్‌, ఆర్ట్స్‌కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రామచంద్రరావు, రాజానగరం టీడీపీ ఇన్‌చార్జి బీవీఆర్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2024 | 12:54 AM