Share News

ఎన్నికలు జరిపించలేని ప్రభుత్వం

ABN , Publish Date - Feb 01 , 2024 | 01:08 AM

రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరిపించలేని దారుణ స్థితిలో వైసీపీ ఉందని, ఓటమి భయంతోనే ఎన్నికలు నిర్వహించలేదని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధ్వజమెత్తారు.

ఎన్నికలు జరిపించలేని ప్రభుత్వం

రాజమహేంద్రవరం, జనవరి 31(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరిపించలేని దారుణ స్థితిలో వైసీపీ ఉందని, ఓటమి భయంతోనే ఎన్నికలు నిర్వహించలేదని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధ్వజమెత్తారు. స్థాని కంగా తన స్వగృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచులు, జడ్పీటీసీలు చనిపోయిన స్థానాల్లో కూడా ఎన్నికలు పెట్టడానికి వైసీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. తెలుగుదేశం సభ విజయవంతం కావడంతో బాకా బాబు అయిన ఎంపీ భరత్‌ ఉలికిపడిపోతున్నారని, గుడిని, గుడిలో లింగాన్ని కూడా మింగేస్తున్నారని ఆరోపించారు. రాజమహేంద్ర వరానికి తానే సృష్టి కర్త అనే విధంగా బాకా ఊదేస్తున్నారని, బావిలో కప్ప తనకు అదే ప్రపంచం అనుకుంటుందని ఎద్దేవా చేశారు. ఎన్నో కబుర్లు చెప్పారని, రింగ్‌రోడ్డని, స్టేడియం అని అని అన్నారు. ఎంపీ మురళీ మోహన్‌ 5 ఫ్లైవోవర్‌ బ్రిడ్జిలు శాంక్షన్‌ చేయిస్తే, వాటిని రద్దు చేయించి, ఒకటి కడుతున్నారని అదైనా ఎప్పటికి పూర్త వుతుందో తెలియదని ఎద్దేవా చేశారు. ఆవ భూముల కుంభకోణం జరిగిందని, ఒక పట్టా కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. అసలు వైసీపీ ప్రభుత్వం నుంచి రాజమహేంద్రవరం అభివృద్ధికి నిధులెన్ని తెచ్చావో శ్వేతపత్రం ప్రకటించాలని ఆయన ఎంపీడీని డిమాండ్‌ చేశారు. రామచంద్రపురంలో చెల్లని మంత్రి, రాజ మహేంద్రవరం రూరల్‌లో ఎలా చెల్లిపోతారని ఆయన ఎద్దేవా చేశారు.

Updated Date - Feb 01 , 2024 | 01:08 AM