Share News

ఏమైపోతున్నారు..వీళ్లు!

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:54 AM

అదృశ్యం అవుతున్న వారంతా ఏమైపోతున్నారు? వ్యభిచార కూపాల్లో చిక్కుకున్నారా?.. వెట్టిచాకిరీలో మగ్గుతున్నారా?.. బాల కార్మికులుగా నలిగిపోతున్నారా?.. ఎవరి కబంధ హస్తాల్లో అయినా చిక్కుకుపోయారా?.. ఇప్పటికే దేశం దాటించేశారా?.. ఇంటికి రావడానికి ముఖం చెల్లక అల్లాడిపో తున్నారా?.. ఎవరైనా నమ్మించి ‘అవసరం’ తీర్చుకొని నడి రోడ్డుపై వదిలేస్తే జీవచ్ఛవాల్లా మిగిలిపోయారా? అసలు ఊపిరితో ఉన్నారా?.. ఇలాంటి ప్రశ్నలు బాధిత తల్లిదండ్రులకు ప్రతిక్షణం నరకం చూపిస్తున్నాయి.

 ఏమైపోతున్నారు..వీళ్లు!

8 ఏళ్లలో 560 మంది జాడలేరు

వీరిలో 220 మంది మహిళలు

సెల్‌ఫోన్‌, స్నేహితుల ప్రభావం

అదృశ్యం కేసులపై తీవ్ర జాప్యం

2016లో కేసూ ఇంకా తేలలేదు

అదృశ్య కేసులపై ప్రత్యేక బృందం

పవన్‌ కల్యాణ్‌ ప్రకటన

తల్లిదండ్రుల్లో చిగురిస్తున్న ఆశలు

అదృశ్యం అవుతున్న వారంతా ఏమైపోతున్నారు? వ్యభిచార కూపాల్లో చిక్కుకున్నారా?.. వెట్టిచాకిరీలో మగ్గుతున్నారా?.. బాల కార్మికులుగా నలిగిపోతున్నారా?.. ఎవరి కబంధ హస్తాల్లో అయినా చిక్కుకుపోయారా?.. ఇప్పటికే దేశం దాటించేశారా?.. ఇంటికి రావడానికి ముఖం చెల్లక అల్లాడిపో తున్నారా?.. ఎవరైనా నమ్మించి ‘అవసరం’ తీర్చుకొని నడి రోడ్డుపై వదిలేస్తే జీవచ్ఛవాల్లా మిగిలిపోయారా? అసలు ఊపిరితో ఉన్నారా?.. ఇలాంటి ప్రశ్నలు బాధిత తల్లిదండ్రులకు ప్రతిక్షణం నరకం చూపిస్తున్నాయి. ఎక్కడ ఉన్నా తమ పిల్లలు క్షేమంగా ఉన్నారనే సమాచారం ఏదో నిమిషంలో అందుతుందనే నమ్మకంతో పోలీసు శాఖ కబురు కోసం ఎదురు చూస్తున్న పండుటాకులు ఎన్నో ఉన్నాయి. వివాహితలు ఇల్లు విడిచి వెళ్లిన సందర్భాల్ల్లో తల్లి కోసం పిల్లలు అల్లాడిపోతున్న ఘటనలు హృదయాన్ని ద్రవింపజేస్తున్నాయి. జిల్లాలో ఒక్కటా రెండా 2016 నుంచి చూస్తే 560 మంది అదృశ్యమైపోయారు.

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

బాలికలు, మహిళల అదృశ్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.. రక్షణగా ఉండాల్సిన వ్యవస్థలు అంద రినీ ఒకే గాటన కట్టేసి దర్యాప్తుల్లో జాప్యం చేయడం వల్ల చాలా మంది ఏ కూపంలో కూరుకుపోయారో ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆడవారికి రక్షణ కల్పించలేని దుస్థితి మౌనంగా వెక్కిరిస్తోంది. కారణాలేమైనా కనబడకుండా వెళ్లిపోతున్నారు. పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసుల కంటే రెండింతలు వెలుగు రాని ఘటనలు ఉంటాయని చెబుతున్నారు. పరువు పోతుందని, చుట్టాల్లో చులకన అయిపోతామని, నాలుగు రోజుల్లో తిరిగి వచ్చేస్తారని.. ఇలా రకరకాల కారణాలతో సరిపుచ్చుకుంటూ ఏ క్షణంలోనైనా ఇంటి తలుపు తడ తారనే ఆవేదనతో ఏడ్చి ఏడ్చి నీరు ఇంకిపోయిన కళ్లతో నిస్తేజ స్థితిలో ఎదురు చూస్తూ బతుకీడ్చే వాళ్లూ ఉన్నా రు. అయితే, అదృశ్యమైన వారి ఆచూకీ పసిగట్టడం నిజంగా పోలీసులకు పెద్ద చిక్కుముడే. కానీ విప్పలేనంత కఠినమైన ముడి మాత్రం కాదు. 2016లోని కేసులో ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. ప్రతి రోజూ అదృశ్యం కేసు లు నమోదవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా యువ తుల ఆచూకీని గుర్తించడానికి ప్రత్యేక పోలీస్‌ బృందాన్ని ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రక టించడంతో కన్నపేగును మళ్లీ చూసుకోగలమన్న గంపె డంత ఆశ బాధిత తల్లిదండ్రుల్లో చిగురిస్తోంది. ఆడపి ల్లలు, మహిళల అదృశ్యంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

సెల్‌ఫోన్‌ భూతం

సెల్‌ఫోన్‌ల వల్ల ఉపయోగం ఏ మాత్రం ఉందోగానీ.. ఆడవాళ్ల జీవితాలు మాత్రం చిక్కుల్లో పడిపోతున్నాయి. సెల్‌ఫోన్‌ల వల్ల సంసారాలు కూలిపోతున్నాయి. కొంత మంది వివాహితలు ‘ఇతరుల’ ఊబిలో కూరుకుపోయి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. సెల్‌ఫోన్‌ లేదా వేరే మార్గాల ద్వారా పరిచయమైన వ్యక్తి చెప్పే మాయ మాటలు, తీపి కబుర్లే జీవితం అనుకొని వెళ్లిపోయి..జీవితం ముళ్లకంపలో ఇరుక్కుపోయిందని కొద్ది రోజులకు తెలుసుకొని రోధిస్తున్నారు. మరికొంత మంది భర్త వేధింపులు తాళలేక ఆ నరకం నుంచి బయటకు వెళ్లిపోతున్నారు..అమ్మా నాన్న చదవమంటున్నారని కొంత మంది విద్యార్థినులు..ఇంట్లో స్వేచ్ఛలేదని మరికొంత మం ది..మాయమాటలకు లోబడి ఇంకొంతమంది తమ జీవితా లను పణంగా పెడుతున్నారు. విద్యార్థినులు ఇల్లు విడిచి వెళుతున్న కేసుల్లో ఎక్కువగా స్నేహితులు, సెల్‌ఫోన్‌ల ప్రమేయం ఉంటోందని నిపుణులు చెబుతు న్నారు.

ఎక్కడికక్కడ ఆరా ఉండాల్సిందే..

బాలబాలికలు, యువతులు, మహిళల కేసుల్లో ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగే విధంగా రక్షణ వ్యవస్థలు మెరుగు పడాల్సిన అవసరం కనిపిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా ఉపయోగించుకొని త్వరి తగతిన ఆచూకీ కనిపెట్టే ఏర్పాట్లు జరగాల్సి ఉంది. ఆచూకీ దొరికిన తర్వాత వారిని సురక్షితంగా తీసుకొచ్చి, తగిన కౌన్సెలింగ్‌ చేసి తల్లిదండ్రులకు అప్పగించాలి. అలాగే ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నా యి.వాటిలో గ్రామ పోలీస్‌ ఉన్నారు. వారిని గ్రామం నుం చి బస్సు, ఆటోలు లేదా ఇతర వాహనాల్లో ఊరి నుంచి బయటకు ఒంటరిగా వెళ్తున్న ఆడవారిపై నిఘా పెట్టే విధానం రావాలి. అనుమానం వస్తే ప్రశ్నించి వివరాలు సేకరించారు. కొత్తగా యువకులు, యువతులు కనిపిస్తే ఆరా తీయాలి. రవాణాకు గేట్‌వేలా ఉండే రాజమ హేంద్రవరం వంటి సిటీల్లోని బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద నిఘా పెంచాలి. ఈ పనులకు మహిళా పోలీసులను వినియోగించుకోవడం లేదా మహిళా సిబ్బందిని నియ మించుకోవడం చేస్తే మేలు జరిగే అవకాశం ఉంటుంది.

తీరు గమనిస్తూ ఉండాలి : ఎస్పీ జగదీశ్‌

అదృశ్యం కేసులపై పూర్తిగా దృష్టి సారించాం.రెండు రోజుల కిందట డీజీపీ కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కొన్ని కేసులను క్షుణ్ణంగా అధ్యయనం చేశాం. దాదాపు 20 వరకూ కారణాలను గుర్తిం చాం.వాటి ఆధారంగా ముందుకు వెళ్లబోతున్నాం.పిల్లల తీరును పెద్దవాళ్లు ఎప్పటికప్పుడు స్కూల్‌, కళాశాల, పని ప్రదేశాల్లో ఆరా తీస్తూ ఉండాలి. సెల్‌ఫోన్లను, సోషల్‌ మీడియా వాడకాన్ని గమనిస్తూ ఉం డాలి. ఏదైనా ఇబ్బంది ఉంటే ముందు మంచిగా, జరగబోయే నష్టం గురించి చెప్పి చూడాలి. అప్పటికీ వినకపోతే పోలీసులను ఆశ్రయించవచ్చు.ఈ విషయంలో సమాజం కూడా తన పాత్ర పోషించాలి. ఎవరైనా అనుమానాస్ప దంగా కనిపిస్తే దగ్గరలోని పోలీసులకు సమాచారం ఇవ్వడం బాధ్యతగా గుర్తె రగాలి. అదృశ్యం కేసులను తగ్గించడానికి పోలీసుల వైపు నుంచి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం.

పవన్‌ అందరికీ చెప్పలేరు కదా?

రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు, బాలికల ఆచూకీ తెలియకుండా పోయిందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎప్పటి నుంచో నెత్తీ నోరు బాదుకుంటూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిస్థితి మరీ దుర్లభంగా మారిపోయిందని ఆవేదన చెందుతూనే ఉన్నారు. అయినా జగన్‌ జమానాలో పట్టించుకున్న దాఖలాలు లేవు. గణాం కాలను పరిశీలిస్తే ఆయన ఎందుకు అంత బాధ పడు తున్నారో అర్థమవుతుంది. 9 నెలల కిందట అదృశ్యమైన ఓ యువతి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో ఎక్కడో జమ్మూలో ఉన్న అమ్మాయిని చిన్న క్లూతో పోలీసులు 48 గంటల్లో గుర్తించారు. మరి మిగతా కేసుల్లో ఎందుకు తాత్సారం జరుగుతోంది? దర్యాప్తులో వేగం ఎం దుకు ఉండడం లేదు? అదృశ్యం కేసులను ఎందుకు చులకనగా చూస్తున్నారు? అనేవి ప్రశ్నలుగానే మిగిలిపో తున్నాయి.వ్యవస్థలు ఎన్ని ఉన్నా ఆడపిల్ల తల్లిదండ్రులకు అవస్థలు తప్పడం లేదనేది బహిరంగ వాస్తవం.

2016 నుంచీ 560 మంది..

అదృశ్యం కేసుల్లో గణాంకాలను పరిశీలిస్తే ఒళ్లు గగుర్పాటుకు గురౌతుంది. 2016 నుంచీ ఉమ్మడి, విభజిత తూర్పుగోదావరిలో నేటి వరకూ బాలలు 21, బాలికలు 70, పురుషులు 249, మహిళలు 220 మొత్తంగా 560 మంది ఆచూకీ దొరకలేదు. గడిచిన ఐదేళ్లలో 18 మంది బాలికలు, 178 మంది యువతులు ఏమైపోయారో ఇప్పటికీ తెలియలేదని పోలీసు గణాంకాలు చెబుతు న్నాయి. ఆచూకీ దొరకని వారిలో మైనర్లు ఉండడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. 2016లోని కేసు కూడా ఇంకా పరిష్కారం కాలేదు.

రాజమండ్రి త్రీటౌన్‌ ప్రథమం..

ఏకంగా 89 అదృశ్యం కేసుల పెండింగ్‌తో రాజమండ్రి 3 టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ మొదటి స్థానంలో ఉంది. తర్వాత రాజానగరం, బొమ్మూరు ఉన్నాయి. సిటీ పరిధిలో ఉన్న రాజమండ్రి 1టౌన్‌,2టౌన్‌, 3టౌన్‌, ప్రకాశంనగర్‌, బొమ్మూ రు పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసుల్లో 198 మంది ఆచూకీ నేటికీ దొరకలేదు. అయితే ఆన్‌లైన్‌లో, రికార్డులు అప్‌డేట్‌ చేయనివి 560 కేసుల్లో కొన్ని ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. 70 మంది బాలికల అదృశ్యం కేసులు జాబితాలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

Updated Date - Jul 05 , 2024 | 12:54 AM