Share News

ఏటిగట్ల పటిష్టానికి చర్యలు

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:29 AM

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 13 చోట్ల బలహీనంగా ఉన్న ఏటిగట్లను పటిష్టం చేసేందుకు రూ.140 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం గుర్తించిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ తెలిపారు. కూళ్ల, సుందరపల్లి వద్ద బలహీనంగా ఉన్న ఏటిగట్లను శనివారం ఆయన పరిశీలించారు. సుందరపల్లి, కూళ్ల వద్ద బలహీన ఏటిగట్లు పటిష్టపరచడానికి రూ.55 కోట్లు అవసరమని చెప్పారు. ప్రస్తుతం రూ. 55 లక్షలతో తాత్కాలిక పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపారు.

ఏటిగట్ల పటిష్టానికి చర్యలు

కె.గంగవరం, జూలై 27: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 13 చోట్ల బలహీనంగా ఉన్న ఏటిగట్లను పటిష్టం చేసేందుకు రూ.140 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం గుర్తించిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ తెలిపారు. కూళ్ల, సుందరపల్లి వద్ద బలహీనంగా ఉన్న ఏటిగట్లను శనివారం ఆయన పరిశీలించారు. సుందరపల్లి, కూళ్ల వద్ద బలహీన ఏటిగట్లు పటిష్టపరచడానికి రూ.55 కోట్లు అవసరమని చెప్పారు. ప్రస్తుతం రూ. 55 లక్షలతో తాత్కాలిక పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపారు. వరదలు తగ్గిన తర్వాత శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడతామన్నారు. కోటిపల్లి మత్స్యకార కాలనీలోని మాధవనగర్‌లో వరద చేరిన ఇళ్లను మంత్రి సుభాష్‌ పడవపై వెళ్లి పరిశీలించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిత్యావసర కిట్‌లు పంపిణీ చేశారు. రామచంద్రపురం ఆర్‌డీవో సుధాసాగర్‌, ఎంపీడీవో ఎన్‌.శ్రీనివాస్‌, తహసీల్దార్‌ రవీంద్రనాథ్‌, సర్పంచ్‌ పెమ్మాడి బేబి సత్తిబాబు, కూటమి నాయకులు వెంటూరు వీర్రాఘవులు చౌదరి, పప్పుల సాయిబాబు, గొడవర్తి రామకృష్ణ, తాడాల జానకిరామ్‌, కర్రి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 12:30 AM