వైసీపీలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వీర్యం
ABN , Publish Date - Oct 27 , 2024 | 12:52 AM
గత వైసీపీ ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థ 20 ఏళ్లు వెనక్కిపోయిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర జల వన రుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇసుక కొరత లేకుండా చూడండి
వారంలో ఓపెన్ ర్యాంపులు
రూ.145కే టన్ను ఇసుక
రాజమహేంద్రవరం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థ 20 ఏళ్లు వెనక్కిపోయిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర జల వన రుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.స్థానిక కలెక్టరేట్‌లో శని వారం జరిగిన తొలి జిల్లా రివ్యూ మీటింగ్‌లో ఆయన మా ట్లాడారు.గత ఐదేళ్ల జగన్ పాల నలో అన్ని రంగాలు నిర్వీ ర్యమయ్యాయ న్నారు.సం క్షేమం పేరుతో జగన్ రాష్ర్టాన్ని దోచుకున్నాడన్నాడు. సీఎం చంద్రనాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలు తీర్చే మంచి ప్రభు త్వం వచ్చిందని, కేంద్రంలో ప్రధాని మోదీ సహకారం అందిస్తున్నారన్నారు. జగన్ ఇసుకను దోపిడీకి వినియో గిస్తే..చంద్రబాబు ప్రజలకు ఉచితంగా అందిస్తున్నార న్నారు. ఇసుక కొరత లేకుండా బోట్స్‌మన్ సొసైటీలను పెంచుతున్నామన్నారు. వారం రోజుల్లో ఓపెన్ రీచ్‌లు ప్రారంభమవుతాయని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం డీసిల్టేషన్ ర్యాంపుల వల్ల టన్ను రూ.625కు అమ్మితే తాము రూ.228కే అందిస్తున్నామన్నారు.అందులో రూ.198 బోట్స్‌మన్ సొసైటీలకే అందు తుందని.. ఓపె న్ రీచ్‌ల వల్ల గత ప్రభుత్వం రూ.475లకు అమ్మితే తాము రూ.145కే టన్ను అందిస్తున్నామన్నారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు సొంత అవసరాలకు ఇసు కను వాడుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. కానీ విక్రయిస్తే ఉపేక్షించేలేదని..కఠిన చర్యలు తీసు కుంటా మని హెచ్చరించారు.ఆర్‌అండ్‌బీ రహదారుల్లో గుంత లను ముందుగా పూడ్చనున్నామని..తర్వాత రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు.డిప్యూటీ సీఎం పవన్ కల్యా ణ్ రూ.4500 కోట్లతో గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణా నికి చేపట్టిన పల్లె పండుగలో గుర్తించిన పనులను సంక్రాంతికే పూర్తిచేయనున్నామన్నారు. గత ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను నిర్లక్ష్యం చేసింద న్నా రు.రాష్ట్రంలో 1080 ఎత్తిపోతల పథకాలు ఉంటే 450 మూతపడ్డా యని చెప్పారు. దీని వల్ల 3 లక్షల ఎకరాల ఆయకట్టు బీడుగా మారిపోయిందన్నారు. వాటికి పున ర్జీవం ఇవ్వడంపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారన్నా రు. పోలవరం ప్రాజెక్టు డయా ఫ్రంవాల్ వైసీపీ వైఖరి వల్ల పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. నవంబరు రెండో వారంలో సీఎం చంద్రబాబు పోలవరం వచ్చి పనులు ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్వహ ణకు ఏడాదికి రూ.980 కోట్లు అవసరం కాగా, వైసీపీ కంటితుడుపుగా కేవలం రూ.270 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు.మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడు తూ జిల్లా అభివృద్ధికి ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ముందుకెళతామని తెలిపారు.కలెక్టర్ ప్రశాంతి మాట్లా డుతూ జిల్లాలో ఇసుక కొరత లేకుండా చూడడం కోసం చర్యలు తీసుకున్నామని..కొద్దిరోజుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ రాజమహేం ద్రవరం నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిపించాలని, గ్రామాల విలీనం వంటి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేసి సిబ్బందిని క్రమబద్ధీకరించాలని సూచించారు. రాజాన గరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూసేకరణ, కోరుకొండ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, తొర్రిగడ్డ రివర్స్ పంపింగ్ స్కీమ్ టెండర్ల ప్రక్రియను చేపట్టాలన్నారు.అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామ కృష్ణారెడ్డి మాట్లాడుతూ చాగల్నాడు, వెంకటనగర్, పుష్కర లిఫ్ట్ పథకాలను పునరుద్ధరించి సాగునీటిని అందించాలని కోరారు.గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపా టి వెంకట్రాజు మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదల కారణంగా కొవ్వాడ,ఎర్రకాలువ గట్లు బలహీనపడ్డా యని,ఈ ప్రాంతంలో సుమారు 6 వేల ఎకరాల వరకూ ముంపునకు గురైందన్నారు.కాలువల ఆధునికీకరణకు ప్రతిపాదనలు పంపించి..పనులు చేపట్టాలని కోరారు. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లా డుతూ వ్యవసాయ యాంత్రిక పరికరాలు,డ్రిప్, ట్రాక్టర్లు సబ్సిడీపై రైతులకు అందజేయాలన్నారు.సమావేశంలో జేసీ ఎస్.చిన్నరాముడు, ఎస్పీ డి.నరసింహ కిశోర్, డీఆర్‌వో జి.నరసింహులు, కమిషనర్ కేతన్‌గార్గ్, ఆర్డీవో కృష్ణనాయక్, సీపీవో అప్పలకొండ పాల్గొన్నారు.