వైసీపీ పాలనతో ఆర్థిక సంక్షోభం
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:54 AM
గత వైసీపీ పాలనతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని టూరిజం శాఖా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.

అటకెక్కిన పర్యాటక ప్రాజెక్టులు
మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
కొవ్వూరు, జూలై 27 : గత వైసీపీ పాలనతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని టూరిజం శాఖా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో అభి వృద్ధి పూర్తిగా పడుకుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు ప్రతిపక్ష పార్టీ నేతలను దూషించడానికి, వ్యక్తిగతంగా విమర్శించడానికే తప్ప రాష్ట్రాభివృద్ధికి పాటుపడిన దాఖలాలు లేవన్నారు. హేవ్‌లాక్ వంతెనను మల్టీపర్పస్ టూరిజం డెవలప్‌మెం టు కింద పట్టాలెక్కించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నా రు. పిచ్చుకలంకలో పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఒబెరాయ్ హోటల్ యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఆగస్టు 31, సెప్టెంబరు 2వ తేదీల్లో వారితో సంప్రదిస్తామన్నారు. కొవ్వూరు, భద్రాచలం పర్యాటక ప్రాజెక్టుకు గడచిన ఐదేళ్లలో ఒక ఇటుక పేర్చలేదన్నారు. గోష్పాదక్షేత్రం అభివృద్ధికి ప్రతిపాదనలు తయారుచేయవలసి ఉందన్నారు. కడియం నర్సరీలను చూడడానికి వచ్చే పర్యాటకులకు రిసార్ట్స్ ఏర్పాటు, పురాతన ఆలయాలను టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. కేంద్ర పర్యాటక శాఖలో ఉన్న దర్శన్, ప్రసాద్ పఽథకాల ద్వారా నిధులు సేకరించాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. తిరుపతి, వైజాగ్, విజయవాడ భవాని ఐలాండ్ అభివృద్ధికి త్వరలో ఒక ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని శాఖల్లో ఒక్క రూపాయి లేకుండా ఖాళీ చేయడంతో ఇప్పటికిప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామన్నారు.రాష్ట్రంలో ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లించకుండా రూ.1600 కోట్లు బకాయి పెట్టారన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.9 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి..కేవలం బటన్ నొక్కింది రూ.2 లక్షల కోట్లు పైచిలుకు మాత్రమే అన్నారు. కేవలం 2 లక్షల కోట్ల రూపాయలకు మాత్రమే ఖర్చు చూపించారన్నారు. మద్యం డబ్బంతా ఏం చేశారో తెలియదన్నారు. ఈ విధంగా రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టేశారన్నారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వెళ్లే ప్రతి బస్సు కొవ్వూరు డిపోకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నా రు. కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కంఠమణి రామకృష్ణారావు, సూరపనేని చిన్ని,బోడపాటి ముత్యాలరావు,డేగల రాము, గంగుమళ్ళ స్వామి, ఎం.వెంకటేశ్వరరావు,బాబ్జి, కొప్పాక విజయకుమార్ పాల్గొన్నారు.