Share News

మంత్రి దుర్గేష్‌.. ఆర్వోబీ పనుల పరిశీలన

ABN , Publish Date - Oct 20 , 2024 | 01:08 AM

నిడదవోలు ఆర్వోబీ నిర్మాణాన్ని నాణ్యతతో నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. శనివారం ఆయన ఆర్వోబీ పనులను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

మంత్రి దుర్గేష్‌.. ఆర్వోబీ పనుల పరిశీలన
నిడదవోలు ఆర్వోబీ పనులను పరిశీలిస్తున్న పర్యాటకశాఖా మంత్రి కందుల దుర్గేష్‌

నిడదవోలు, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): నిడదవోలు ఆర్వోబీ నిర్మాణాన్ని నాణ్యతతో నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. శనివారం ఆయన ఆర్వోబీ పనులను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి కెనాల్‌ నుంచి సాగునీరు అందించడం వలన వీటి పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. మెయిన్‌ రోడ్డులో సర్వీస్‌ రోడ్లు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఆర్‌అండ్‌బి ఈఈ జి.రూప్‌కుమార్‌, డీఈ డీబీ రమణ, ఏఈ ఎం.శ్రీనివాస విజయ్‌, టీడీపీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు బీజేపీ అధ్యక్షుడు నీలం రామారావు, జనసేన అధ్యక్షుడు రంగా రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 01:08 AM