Share News

అమాత్యులు ఎవరో!

ABN , Publish Date - Jun 08 , 2024 | 01:01 AM

గెలిచేశాం.. వాట్‌నెక్ట్స్‌.. ఇంకేముంది.. ఎలాగైనా మంత్రి వర్గంలో చోటు సంపాదించాలి.. ఇదీ నాయకుల ఆశ.. ఆ దిశగా ఎవరికి వారు ఇప్పటికే ప్రయత్నాలు ఆరంభించారు.. ఎవరు మంత్రి అవుతారు.. ఎవరు ఎమ్మెల్యేగా ఉంటారనేది త్వరలో తేలనుంది.

అమాత్యులు ఎవరో!

పురందేశ్వరికి కేంద్ర మంత్రి పదవి?

రాష్ట్ర మంత్రి పదవులకు తీవ్ర పోటీ

సీనియర్‌ కోటాలో గోరంట్లకు చాన్స్‌?

ఎస్సీ కోటాలో మద్దిపాటికి దక్కేనా

కందుల, బత్తుల ప్రయత్నాలు

బీజేపీ కోటాలో నల్లమిల్లికి ఆశ

మరో మూడు రోజుల్లో స్పష్టత

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

గెలిచేశాం.. వాట్‌నెక్ట్స్‌.. ఇంకేముంది.. ఎలాగైనా మంత్రి వర్గంలో చోటు సంపాదించాలి.. ఇదీ నాయకుల ఆశ.. ఆ దిశగా ఎవరికి వారు ఇప్పటికే ప్రయత్నాలు ఆరంభించారు.. ఎవరు మంత్రి అవుతారు.. ఎవరు ఎమ్మెల్యేగా ఉంటారనేది త్వరలో తేలనుంది. ఎందుకంటే ఈ సారి మంత్రివర్గ కూ ర్పులో తీవ్ర పోటీ ఉంటుంది...ఈ సారి టీడీపీ,జనసే, బీజేపీ కూటమిగా ఏర్పడి బరిలో దిగాయి. 175 స్థానాలకు ఏకంగా 164 సీట్లలో విజయం సాధించాయి.ఈ నేపథ్యంలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందనే దానిపై అంచనాలు వేసుకుం టున్నారు. తెలుగుదేశం-జనసేన- బీజేపీ కూటమి అఖండ విజయం సాధించిన నేపథ్యంలో కేంద్రంలోనూ, రాష్ట్రం లోనూ ఎన్‌డీఏ ప్రభుత్వాలు ఏర్పడనున్నాయి. రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాన మంత్రిగా నరేంద్రమోదీ ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. జిల్లాలో కూటమి తరపున గెలిచిన అభ్యర్థుల్లో కొందరు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నుంచి అత్య ధిక మెజార్టీతో గెలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.రాజమండ్రి లోక్‌సభ చరిత్రలో ఇంత వరకూ ఎవరికీ రానంత మెజార్టీ ఆమెకు లభించిన సంగతి తెలిసిందే.2014లో జరిగిన ఎన్నికల్లో మాగంటి మురళీ మోహన్‌కు 1,67,434 ఓట్ల మెజార్టీ లభించింది. ప్రస్తుతం పురందేశ్వరికి 2,39,139 ఓట్ల మెజార్టీ లభించింది.పైగా ఆమె ఎన్టీఆర్‌ కూతురు. పైగా ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా ఉన్న సంగతి తెలిసిందే.ఈ పరిస్థితుల్లో ఆమెకు కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఒకసారి ఆమె కేంద్ర మంత్రి పదవిని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేప థ్యంలో ఆమెకు పదవి కచ్చితంగా వస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఆదివారం ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కాబట్టి మంత్రి వర్గం కూడా అప్పుడే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటే శనివారం రాత్రిలోపు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోనే ఉన్నా రు. ఎన్డీఎ పక్షాల మీటింగ్‌ కోసం ఆమె వెళ్లారు. ఇక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కూటమి తరపున తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అదే రోజు మంత్రి వర్గం కూడా ఏర్పడనుంది. జిల్లా నుంచి గెలిచిన వారంతా పదవులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్‌ టీడీపీ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి మంత్రి పదవి వస్తుందనే ప్రచారం జరుగుతోంది. సామాజిక వర్గాల సమీకరణల నేప థ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేని స్థితి నెల కొంది. సీనియర్‌నేత కావడం వల్ల ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం సబబనే వాదన ఉంది. ఇక ఎస్సీ కోటాలో గోపాలపురం నియోజక వర్గం నుంచి మంత్రి తానేటి వనితను ఓడించి విజేతగా నిలిచిన మద్ది పాటి వెంకట్రాజుకు కూడా మంత్రి పదవి వచ్చే అవ కాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన జిల్లా మంత్రిని ఓడించ డంతో పాటు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌కు బాగా సన్నిహితంగా ఉండే నాయకుడు. ఈ పరిస్థితుల్లో ఆయన పేరు మంత్రి పదవి కోటాలో బలంగా వినిపిస్తోంది. ఇక కొవ్వూరు ఎమ్మెల్యే విజేత ముప్పిడి వేంకటేశ్వరరావు, రాజ మండ్రి సిటీ నుంచి అత్యధిక మెజార్టీతో, విజేతగా నిలిచిన ఆదిరెడ్డి వాసు పదవి ఆశిస్తున్నారు. ఇక బీజేపీ కోటాలో తనకు అవకాశం ఉండొచ్చనే ఆలోచనలో అనపర్తి ఎమ్మెల్యే విజేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వర్గం భావిస్తోంది. పురం దేశ్వరికి కేంద్ర మంత్రి పదవి వస్తే ఆయన పేరు పరిశీలనలో ఉండకపోవచ్చు.ఇక మరో ముఖ్యమైన పార్టీ జనసేన. నిడదవోలు నుంచి కందుల దుర్గేష్‌, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ గెలిచిన సంగతి తెలిసిందే. జనసేనలో కాపు కోటాలో ఒకరికి అవకాశం ఉండవొచ్చనే ప్రచారం జరుగుతోంది. కందుల దుర్గేష్‌ జనసేన సీని యర్‌నేత. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా, జనసేనపొలిటికల్‌ ఎఫైర్స్‌కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఆయనకు ప్రాధాన్యత ఉండొచ్చనే ప్రచారం ఉంది. ఇక బత్తుల బలరామకృష్ణ కూడా తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్టు తెలుస్తోంది. చివరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీల అధినేతలు కూర్చుని, సామాజిక వ ర్గాలు,ప్రాంతాలు, సీనియార్టీ వంటివన్నీ పరిగణనలోకి తీసు కుని ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. రెం డు మూడు రోజుల్లో ఎవరికి పదవనేది స్పష్టత రానున్నది.

Updated Date - Jun 08 , 2024 | 01:01 AM