Share News

లంక వాసులకు ఉచిత వైద్య సేవలు

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:31 AM

మంజీరా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం వలసలతిప్ప, పొట్టితిప్ప, సలాదివారిపాలెం, కొత్తలంక, శేరిలంక గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. మందులు పంపిణీ చేశారు

లంక వాసులకు ఉచిత వైద్య సేవలు

ముమ్మిడివరం, మార్చి 10: మంజీరా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం వలసలతిప్ప, పొట్టితిప్ప, సలాదివారిపాలెం, కొత్తలంక, శేరిలంక గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. మందులు పంపిణీ చేశారు. ఆసుపత్రి వైద్యురాలు మంజీరా మాట్లాడుతూ పేదలకు తమవంతు సాయంగా ఉచిత వైద్య సేవలందిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సలాది సీత, కొండేపూడి భద్రరావు, మాజీ సర్పంచ్‌ గెడ్డం శేఖరం, ఎంపీటీసీ కొండేపూడి భవానీ, సలాది రామచంద్రరావు, కొండేపూడి అప్పారావు, బీర చిన్నారావు, కొండేపూడి నాగేశ్వరరావు, గుర్రాల పెదవెంకట్రావు, నేరుడుమిల్లి అబ్బులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 12:31 AM