దోమల నిర్మూలనతోనే వ్యాధులకు చెక్
ABN , Publish Date - Aug 21 , 2024 | 12:19 AM
దోమల నిర్మూలనపై ముమ్మి డివరం అర్బన్ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో మంగళవారం వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.
ముమ్మిడివరం, ఆగస్టు 20: దోమల నిర్మూలనపై ముమ్మి డివరం అర్బన్ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో మంగళవారం వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. వైద్యురాలు యోగితాలక్ష్మి సారఽ ద్యంలో నిర్వహించిన ర్యాలీలో దోమల నిర్మూలనకు తీసుకోవ ల్సిన చర్యలు, దోమలు వల్ల వచ్చే వ్యాధులు గురించి వివ రించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆసుపత్రి నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వైద్య సిబ్బంది బి.సంపూర్ణ, సత్యన్నారాయణ పాల్గొన్నారు.