నేడు పిఠాపురంలో మెగా జాబ్‌మేళా
ABN , Publish Date - Aug 24 , 2024 | 12:26 AM
పిఠాపురం, ఆగస్టు 23: వికాస ఆధ్వర్యంలో పట్టణంలోని అంజనా జూనియర్ కళాశాల, ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూలు ఆవరణలో శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహించను
పిఠాపురం, ఆగస్టు 23: వికాస ఆధ్వర్యంలో పట్టణంలోని అంజనా జూనియర్ కళాశాల, ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూలు ఆవరణలో శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నా రు. 40 కంపెనీల్లో 2,500 ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు వికాస ప్రాజెక్టు డైరెక్టరు కె.లచ్చారావు తెలిపారు. హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, సదర్ ల్యాండ్, గ్లోబల్ సర్వీసెస్, స్వేయా ఇన్ఫోటెక్, సైబర్ క్యూబ్స్, ఇండిగో ఎయిర్‌లైన్స్ తదితర కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు వివరించారు. ఎస్‌ఎస్‌సీ నుంచి పీజీ వరకూ ఉత్తీర్ణులై 35ఏళ్లలోపు ఉన్న వారు వీటికి అర్హులని, వేతనం రూ.13వేలు నుంచి రూ.40వేలు వరకూ ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ధృవీకరణపత్రాల తో ఉదయం 9గంటలకు జాబ్‌మేళా జరిగే ప్రాంతానికి చేరుకోవాలని సూచించారు.