Share News

వైద్య విద్యార్థిని ఘటనలో దోషులను శిక్షించాలి

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:15 AM

కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘనటలో దోషులను కఠినంగా శిక్షించాలని యానాం జిప్మెర్‌ వైద్య బృందం డిమాండ్‌ చేసింది.

వైద్య విద్యార్థిని ఘటనలో దోషులను శిక్షించాలి

యానాం, ఆగస్టు 20: కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘనటలో దోషులను కఠినంగా శిక్షించాలని యానాం జిప్మెర్‌ వైద్య బృందం డిమాండ్‌ చేసింది. స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్ద నుంచి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, యానాం జిప్మెర్‌ ప్రతినిధి ఆనంద్‌రాజ్‌ పాల్గొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభు త్వాసుపత్రి నుంచి ప్రారంభమైన ర్యాలీ విష్ణాలయం, చిన్నాసెంటర్‌, పాత బస్టాండ్‌, కొత్తబస్టాండ్‌, సుబ్రహ్మణ్యభారతివీధి, చింతా వీధి మీదుగా జిప్మెర్‌ ఆసుపత్రికి చేరింది. అనంతరం పరిపాలనాధికారికి వినతిపత్రం అందజేశారు. ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ యానాం శాఖ అధ్యక్షుడు మల్లాడి శామ్యూల్‌, పెండెం సూర్యప్రకాష్‌, గిడ్ల చంద్రరావు, జిప్మెర్‌, యానాం ప్రభుత్వాసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 12:15 AM