Share News

మీ చేతిలోనే మీ సేవ

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:20 AM

పెద్దాపురం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అందిస్తున్న పలు రకాల సేవలు ఇక మరింత సులభతరమయ్యా యి. ఇప్పుడు ఎంకంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ), సర్టిఫైడ్‌ కాపీ (సీసీ)ల కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, మీసేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. సగటు పౌరుడు సైతం నే

మీ చేతిలోనే మీ సేవ

ఇక నిమిషాల్లో ఈసీ, సీసీ

మీ సేవల ద్వారా సేవలు యథాతథం

మధ్యవర్తుల ప్రమేయానికి చెక్‌

గేట్‌ వేను అభివృద్ధి చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ

ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

పెద్దాపురం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అందిస్తున్న పలు రకాల సేవలు ఇక మరింత సులభతరమయ్యా యి. ఇప్పుడు ఎంకంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ), సర్టిఫైడ్‌ కాపీ (సీసీ)ల కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, మీసేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. సగటు పౌరుడు సైతం నేరుగా ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే సౌక ర్యాన్ని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్‌లైన్‌ విధానంలో అవసర మైన రుసుము, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు చెల్లిస్తే క్షణాల వ్యవధిలో ఆయా సేవలు పొంద వచ్చు. ప్రస్తుత ప్రక్రియలో మధ్యవర్తుల ప్రమే యం ఉండబోదని అధికారులు చెబుతున్నారు. మీసేవా కేంద్రాల్లో ఈసేవలు అందుబాటలో లేవని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని అందులో ఎంతమాత్రం వాస్తవం లేదని చెబుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో కూడా..

ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో లేని గ్రామీ ణ ప్రాంతాల్లో మీసేవ కేంద్రాల ద్వారా ఆయా కాపీలను అందుకోవచ్చు. దానికి ఎలాంటి పరి మితులు లేవు. గతంలో వీటికోసం మీసేవలో ధరఖాస్తు చేశాక, అది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల యానికి చేరుకుని అక్కడ తగిన అనుమతులు పొందిన తరువాత మీసేవలో మాత్రమే డాక్యుమెంట్లను పొందగలిగేవారు. ఫలితంగా మితిమీరిన కాలయాపన జరిగేది. దరఖా స్తుదారు రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చే ది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా తక్కువ సమ యంలో డాక్యుమెంట్లు ప్రజలకు చేరనున్నాయి. గతంలో దరఖాస్తుదారు చెల్లించిన రుసుము మీసేవ విభాగానికి జమయ్యేవి. ఇప్పుడు నేరుగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చేరనున్నాయి.

ఆన్‌లైన్‌ విధానంతో సత్ఫలితాలు..

గతంలో ఈసేవల పొందేందుకు ప్రతీ ఒక్కరూ మీసేవా కేంద్రానికి వెళ్లవలసి వచ్చేది. కొత్త ప్రభుత్వం ఈ శ్రమను సైతం తగ్గించా లని నిర్ణయించింది. ఫలితంగా అందుబాటు లోకి వచ్చిన ఆన్‌లైన్‌ విధానం సత్ఫలితాలను ఇస్తోంది. నిర్ణీత దరఖాస్తు నింపి దానిని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లేదా మీసేవా తీసకెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇందుకోసం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ తన వెబ్‌సైట్‌ ద్వారా చెల్లింపు గేట్‌వేను అభివృద్ధి పరిచింది. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో ఈసీ,సీసీ కాపీలను తక్షణమే పొందగలిగే వెసులుబాటు లభించింది.

Updated Date - Nov 28 , 2024 | 12:20 AM