Share News

బంతి సాగు లాభదాయకం

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:31 AM

జిల్లాలోని రాజా నగరం, కడి యం ప్రాంతా లలో సార్వా వరి తరువాత బంతి సాగు వల్ల రైతులకు లాభం చేకూ రుతుందని జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ చల్లా వెంకట నరసింహారావు తెలిపారు. మార్టేరు శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌తో కలసి వెలుగుబంద, వెంగాయమ్మపేట, కడియపుసావరం గ్రామాల్లో శుక్రవారం పర్యటించి వరి తరువాత పూలమొక్కలు సాగుచేసే రైతులను కలసి పలు సూచనలు చేశానని ఒక ప్రకటనలో తెలిపారు.

బంతి సాగు లాభదాయకం
పూలతోటలను పరిశీలిస్తున్న నరసింహారావు

  • ఏరువాక జిల్లా కోఆర్డినేటర్‌ నరసింహారావు

దివాన్‌ చెరు వు, మార్చి 15: జిల్లాలోని రాజా నగరం, కడి యం ప్రాంతా లలో సార్వా వరి తరువాత బంతి సాగు వల్ల రైతులకు లాభం చేకూ రుతుందని జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ చల్లా వెంకట నరసింహారావు తెలిపారు. మార్టేరు శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌తో కలసి వెలుగుబంద, వెంగాయమ్మపేట, కడియపుసావరం గ్రామాల్లో శుక్రవారం పర్యటించి వరి తరువాత పూలమొక్కలు సాగుచేసే రైతులను కలసి పలు సూచనలు చేశానని ఒక ప్రకటనలో తెలిపారు. మార్టేరు పరిశోధనా స్థానంలో పరిశోధనా ఫలితాలను రైతుల కమతాల్లో పరీక్ష చేసే ప్రక్రియలో భాగంగా కడియపుసావరం, వడిశలేరు ప్రాంతాల్లో సార్వా వరి తరువాత వివిధ పంటలైన మినుము, మొక్కజొన్న బంతిసాగులను పరిశీలించామన్నారు. వీటిలో బంతిసాగు చేపట్టిన రైతులకు లాభాలు ఎక్కువగా చేకూరడం గమనించామని తెలిపారు. రైతు ఎన్‌.సత్తిరాజు కమతంలో పంట ఆర్థిక స్థితిగతులను పరిశీలించామని, బాగా లాభాలు ఆర్జిస్తున్నారని చెప్పారు. సార్వా వరి నవంబరులో కోతకోయగానే బంతి నారు ఊడ్చారన్నారు. వాటి నుంచి పూలు కోతకు వస్తున్నాయని నిత్యం పూలమార్కెట్‌కు అమ్మి ఆదాయం పొందుతున్నారని తెలిపారు. అంతేగాక బంతిని వరికోత తర్వాత ఒకేసారి కాకుండా 15 రోజుల వ్యవధిలో పలుమార్లు నాటితే నిరాటంకంగా పూలు ఉత్పత్తి జరుగుతుందన్నారు. వివాహాది శుభ కార్యక్రమాలకు డిమాండ్‌ను బట్టి సరఫరా చేసి ఆదాయం పొందవచ్చునని చెప్పారు.

Updated Date - Mar 16 , 2024 | 12:31 AM