Share News

మంచుటెండ

ABN , Publish Date - Feb 17 , 2024 | 01:17 AM

: జిల్లాలో విభిన్న వాతా వరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం వేళల్లో నెత్తిన సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు. రాత్రయితే చలి తీవ్రతకు ప్రజలు గజగజలాడుతున్నారు.

మంచుటెండ
పెద్దాపురంలో శుక్రవారం ఉదయం కమ్మేసిన పొగమంచు

భిన్న వాతావరణ పరిస్థితులు

పగటిపూట భానుడి భగభగలు

రాత్రి నుంచి ఉదయం వరకూ వీడని చలి, పొగమంచు

తాజా మార్పులతో జిల్లావాసులకు తప్పని ఇబ్బందులు

వృద్ధులు, పిల్లలతోపాటు పలువురికి అనారోగ్య పరిస్థితులు

పెద్దాపురం, ఫిబ్రవరి 16: జిల్లాలో విభిన్న వాతా వరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం వేళల్లో నెత్తిన సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు. రాత్రయితే చలి తీవ్రతకు ప్రజలు గజగజలాడుతున్నారు. గడచిన వారంరోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచే సుకున్నాయి. రాత్రి సమయాల్లో చలి తీవ్రత పెరగ డంతో వృద్ధులు, చిన్నారులు వణుకుతున్నారు. ము ఖ్యంగా మంచు అధికంగా ఉంటుండడంతో వృద్ధులు, చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారు. అంతకు ముందు తుఫాన్ల కారణంగా వర్షాలు, ఉదయం ఎం డల తీవ్రత, తెల్లవారుజామున మంచు ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గడచిన వారం రోజు లుగా మళ్లీ చలి తీవ్రత పెరిగిపోవడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో శీతల గాలుల తీవ్రతతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఫలి తంగా చలి విజృంభిస్తోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి దట్టమైన చలిగాలులతో పరిస్థితి ఒక్కసారిగా భిన్నంగా మారిపోయింది. ఉదయం బయటకు వెళ్లాంటే స్వెట్టర్లు ధరించి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్ప డింది. రాత్రి సమయాల్లో ఉష్ణ్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే తక్కువగా నమో దవుతున్నాయి. అంతేకాకుండా తెల్లవారుజామున పొగ మంచు కమ్మేస్తోం ది. ఈ సమయంలో రహదార్లపైౖ ప్రయాణం చేయాలంటే కత్తిమీద సాము లాగే ఉంటోంది. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఉదయం 9 గంటల వరకూ చలిగాలులు వీస్తుండడంతో చలికి వణికిపోవాల్సి వస్తోంది. తిరిగి రాత్రి సమయాల్లో ఇదే పరిస్థితి పునరావృత్తం అవు తోంది. సాయంత్రం ఐదు గంటలు దాటితే చలి వణికిస్తోంది. ఈ ఏడాది వేసవిలో మొదట ఓ మోస్త రు వేడి మొదలై ఆ తరువాత క్రమేపీ తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఏడాదికంటే ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెబు తున్నారు. సముద్రంలో ఎల్‌నినో తీవ్రంగా ఉన్న కారణంగా ఆ ప్రభావంతో ఎండలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి నెలలోనే ఉదయం సమయాల్లో సూర్యుడు ఠారెత్తించే పరిస్థితులు నెలకొనడంతో ముందుముందు పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న విభిన్న వాతావరణ పరిస్థి తుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. గాలిలో తేమశాతం పెరగడంతో ఉదయం వేళల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదయం రహదారులను మంచుతెరలు కమ్మేస్తున్నాయి. చలిగాలుల తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.

Updated Date - Feb 17 , 2024 | 01:17 AM