Share News

మానవాళిని చీకటి నుంచి వెలుగులోకి నడిపించేది సైన్స్‌

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:24 AM

మానవాళిని చీకటి నుంచి వెలుగులోకి నడిపిం చేది సైన్స్‌ అని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.ప ద్మరాజు అన్నారు. విశ్వవిద్యాలయంలో బుధవారం జాతీయసైన్స్‌ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు.

మానవాళిని చీకటి నుంచి వెలుగులోకి నడిపించేది సైన్స్‌

నన్నయ వీసీ పద్మరాజు

పలు పాఠశాలల్లో జాతీయ వైజ్ఞానిక దినోత్సవం

దివాన్‌చెరువు, ఫిబ్రవరి 28: మానవాళిని చీకటి నుంచి వెలుగులోకి నడిపిం చేది సైన్స్‌ అని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.ప ద్మరాజు అన్నారు. విశ్వవిద్యాలయంలో బుధవారం జాతీయసైన్స్‌ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. వికసితభారత్‌ కోసం స్వదేశీ సాంకేతికత అనే అం శంతో నిర్వహించిన ఈకార్యక్రమంలో వీసీ ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు. తొలు త నన్నయ విగ్రహానికి, సి.వి.రామన్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ సీవీ రామన్‌ వంటి మహ నీయులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విశిష్టఅతిఽథిగా హాజరైన మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌సైన్స్‌స్‌ ప్రాజెక్ట్‌ అప్రైజల్‌, మానిటరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ వై.వి.ఎన్‌.కృష్ణ మూర్తి మాట్లాడుతూ మానవసంబంధాలు, ఆర్ధికసం బంధాలు శాస్త్రసాంకేతిక రంగాలతో ఆధారపడి ఉన్నాయని గుర్తుచేశారు. ఆచార్య జి.మురళీకృష్ణ, డాక్టర్‌ కె.నూకరత్నం రచించిన పైథన్‌ ప్రోగ్రామింగ్‌ ఫర్‌ జియోగ్రాఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ పుస్తకాన్ని వీసీ ఆవిష్కరించారు. రిజిస్ట్రార్‌ ఆచార్య జి.సుధాకర్‌, ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌ బి.జగన్మోహనరెడ్డి, డీన్‌ వై.శ్రీనివాసరావు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలి

బిక్కవోలు: విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్స్‌ ఎగ్జిబిషన్‌లు దోహదపడతాయని పందలపాక ఉన్నత పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కోణాల సత్తిరాజు తెలిపారు. సర్‌ సీవీ రామన్‌ ఎఫెక్టు కనుగొన్న రోజు సందర్భంగా జాతీయ దినోత్సవాన్ని పందలపాక ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను కోణాల సత్తిరాజు ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ప్రాజెక్టులను పరిశీలించి ఉత్తమమైన వాటికి బహుమతులు అందజేసి, వీరికి సహకరించిన సైన్సు ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో పీఎంసీ చైర్మన్‌ కొవ్వూరి నాగిరెడ్డి, హెచ్‌ఎం చిర్ల శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బిక్కవోలు ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్సు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీవీ రామన్‌ చిత్రపటానికి హెచ్‌ఎం పీవీ ప్రభాకరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఇళ్లపల్లి ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్సు దినోత్సవాన్ని నిర్వహించారు. సీవీ.రామన్‌ చిత్రపటానికి హెచ్‌ఎం పి.శ్రీనివాసరెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా బిక్కవోలు ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారి డాక్టర్‌ దుర్గాదేవి ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటుచేసి విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు జరిపారు.

రాజానగరం: సైన్సు దినోత్సవ సంబరాలను రాజానగరంలోని దివ్య విద్యా సం స్థల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి దివ్య విద్యాసంస్థల చైర్మన్‌ బర్ల సత్యనారాయణ ముఖ్యఅతిఽథిగా విచ్చేసి సీవీ రామన్‌ ఫోటోకు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వివిధ తరగతుల విద్యార్థులు పలు అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులను తిలకించారు. మండలంలో వెలుగు బంద ప్రాఽథమికోన్నత పాఠశాలలో సైన్సుడేను పురస్కరించుకుని విద్యార్ధులు ప్రదర్శించిన వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ అబ్బురపరిచింది. విద్యార్ధులు వివిధ అంశాలపై నమూనా ప్రదర్శన ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అగ్నేశ్వరరావు జాతీయ సైన్సుడే విశిష్టతను విద్యార్ధులకు వివరించారు.

రంగంపేట: బాల్యం నుంచి శాస్ర్తీయ వైఖరిని పెంపొందించుకొని, నిత్యజీవితంలో వాటిని వినియోగించుకొని, అద్భుత ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు వి.పార్ధసారధి సూచించారు. రంగంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం పాఠశాలలో సైన్స్‌ ప్రదర్శనలను ఆయన ప్రారంభించారు. సుమారు 200 ప్రదర్శనలను విద్యార్థులు ఏర్పాటుచేశా రన్నారు. కార్యక్రమంలో సైన్స్‌ ఉపాధ్యాయులు కె.వి.వి.ఎన్‌.వరలక్ష్మీ, ఐ.ఏ.ఎస్‌.భారతి, ఎం.సత్యదేవి,టి.సావిత్రి,కె.ఓంప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

పరిశోధనలపై ఆశక్తి పెరగాలి

దివాన్‌చెరువు: శాస్త్ర, సాంకేతికరంగాల పరిశోధనలపై విద్యార్థులకు ఆశక్తి పెరగాలని స్థానిక శ్రీప్రకాష్‌ విద్యానికేతన్‌ ప్రిన్సిపాల్‌ ఎ.ఎస్‌.ఎన్‌.మూర్తి అన్నా రు. దివాన్‌చెరువులోని శ్రీప్రకాష్‌లో జాతీయ సైన్స్‌ దినోత్సవంను బుధవారం నిర్వహిం చారు. ఈసందర్భంగా విద్యార్థులు వైజ్ఞానికప్రదర్శన ఇచ్చారు. కార్యక్రమంలో అకడమిక్‌ కోఆర్డినేటర్‌ విమల తదితరులు పాల్గొన్నారు.

శ్రీగౌతమిలో సైన్సు క్వెస్ట్‌

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): జాతీయ సైన్యు దినోత్సవాన్ని పురస్కరించుకొని 26 నుంచి 28 వరకూ సైన్సు క్వెస్ట్‌ పేరుతో విజ్ఞాన ప్రదర్శన నిర్వహించామని శ్రీగౌతమి కరెస్పాండెంట్‌ సుంకర రవి కుమార్‌ తెలిపారు. బుఽధవారం 9వ తరగతి విద్యార్థుల ప్రదర్శనను డీఈవో కె.వాసుదేవరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ మల్లికార్జున్‌, ప్రిన్సిపాల్స్‌ తదితరులు పాల్గొన్నారు.

భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన రామన్‌

కొవ్వూరు: సీవీ రామన్‌ 1928లో రామన్‌ ప్రభావాన్ని కనుగొని ప్రపంచంలో భారతదేశాన్ని భౌతికశాస్త్రంలో అగ్రగామి గా నిలిపారని కొవ్వూరు ఏబీఎన్‌, పీఆర్‌ఆర్‌ డిగ్రీ కలాశాల ప్రిన్సిపాల్‌ నందిగం వెంకట సుబ్బారావు అన్నారు. కొవ్వూరు అల్లూరి బాపినీడు, పెండ్యాల రంగారావు డిగ్రీ, పీజీ కళాశాలలో బుధవారం జాతీయ సైన్సు దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ నందిగం వెంకట సుబ్బారావు మాట్లాడుతూ రామన్‌ ప్రభావాన్ని కనుగొన్న ఫిబ్రవరి 28వ తేదీని అప్పటినుంచి దేశవ్యాప్తంగా జాతీయ సైన్సు దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, నానో ఫిజిక్స్‌, అనువర్తనములు, కేంద్రక భౌతికశాస్త్రం, భౌతికశాస్త్రంలో నోబెల్‌ గ్రహీతలు, ఇంద్రదనస్సు ఎలా ఏర్పడుతుంది అనే అంశాలను వివరించారు. అనంతరం క్విజ్‌, పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎ.శ్రీనివాసు, బి.సత్యనారాయణ, ఎం. అనూషాదేవి, డీఎస్‌ఎస్‌ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరు ప్రబుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ జె. సునీత ఆధ్వర్యంలో బుధవారం జాతీయ సైన్సు దినోత్సవాన్ని నిర్వహించారు. కొవ్వూరు మండలం ధర్మవరం స్వర్ణభారతి పాఠశాలలో పేరిచర్ల రామకృష్ణరాజు ఆధ్వర్యంలోను, కొవ్వూరు డా.సర్వేపల్లి రాధాకష్ణ హైస్కూల్‌లో అక్షయపాత్ర శ్రీనివాస రవీంద్ర ఆధ్వర్యంలో సర్‌ సీవీ రామన్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ సైన్సు దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్ధులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

తాళ్ళపూడి: మండలంలో పలు ప్రభుత్వ ప్రాఽథమిక పాఠశాలల్లో బుధవా రం సైన్స్‌ డే ఘనంగా నిర్వహించారు. బల్లిపాడు ప్రాఽథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు డీవీకే రాజు మాట్లాడుతూ సైన్సును చివరి శ్వాసవరకూ ఆరాధిస్తాను అని అన్న సీవీ రామన్‌ మాటలు పట్టుదల ప్రతి విద్యార్థి గుర్తించుకోవాలని తెలిపారు. సైన్స్‌ డే సందర్భంగా ఒక విద్యార్థికి సి వి రామన్‌ వేషధారణవేసి పలు ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో సహా ఉపాధ్యాయులు వరలక్ష్మి, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. ప్రక్కిలంక స్పెషల్‌ స్కూల్‌లో సైన్స్‌డేను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయుడు కందుల శ్రీనివాస్‌ ఆధ్వ ర్యంలో విద్యార్థులు వివిధ రకాల సైన్స్‌ ప్రాజెక్టులను ప్రదర్శించారు.

గోపాలపురం: గణిత శాస్త్రవేత్త సీవీ రామన్‌ జయంతిని స్థానిక గురుకుల పాఠశాలలో బుధవారం ఘనంగా జరుపుకు న్నారు. ఈ సందర్భంగా సైన్స్‌డే నిర్వహించారు. అనంతరం సీవీ రామన్‌ చిత్రపటానికి పూలమాలలువేసి రామన్‌ ఎఫెక్ట్‌ గురించి వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన సైన్స్‌ ఫ్రాజెక్టులు ప్రదర్శించారు. ప్రిన్సిపల్‌ ఉమాదేవి మాట్లాడుతూ సాంకేతికంగా ప్రతీ విద్యార్థి సైన్స్‌పట్ల అవగాహాన కలిగి ఉండా లన్నారు. ప్రతీ విద్యార్థి వైజ్థానిక ప్రదర్శన పట్ల ఆసక్తి చూపాలని ఆయా రంగాల్లో విద్యార్థులు రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. గణిత పితా మహుడు సీవీ రామన్‌ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని శాస్త్రవేత్తగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో సైన్స్‌ ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, సీఆర్‌పీ నాగరాజు, విద్యార్థులు పాల్గొన్నారు.

నల్లజర్ల: నేషనల్‌ సైన్సు డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం నల్లజర్ల సెయింట్‌ జోషప్‌ స్కూల్‌లో విద్యార్థులు రూపొందించిన సైన్సు ఈవేంట్స్‌ ప్రదర్శనను ఎంఈవో సత్యనారాయణ పరిశీలించారు. స్కూల్‌ డైరెక్టర్‌ మేణ్ని జానికీ దేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నల్లజర్ల హైస్కూల్‌,సెయింట్‌ క్లారెట్స్‌ స్కూల్స్‌లో సైతం సైన్సు డే ప్రదర్శనలు జరిగాయి.

దేవరపల్లి: దేవరపల్లిలో జాతీయ సైన్స్‌డే సందర్భంగా భాష్యం, సత్యసాయి స్కూల్‌లో విద్యార్థులు వైజ్ఞానిక ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో సెన్సార్‌ సోలార్‌ ఎనర్జీ, బయోగ్యాస్‌, చంద్రయాన్‌, రాకెట్‌ మోడల్స్‌ ఆటోమే టిక్‌ వాటర్‌ పంపు పలు ప్రాజెక్టులు అలరించాయి. కార్యక్రమాల్లో సత్యసాయి స్కూల్‌ ప్రిన్సిపల్‌ సత్యరాజు వేణు గోపాలరావు, పేరయ్య నాయుడు, చామ్స్‌ ప్రిన్సిపల్‌ సభాన, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 12:24 AM