Share News

మద్యంపై మాట తప్పారు..ఓటెలా అడుగుతారు!

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:25 AM

అది 2019 మే 26.. తన ప్రమాణ స్వీకారానికి ప్రధా నిని,ఇతర ప్రముఖులను ఆహ్వానించడానికి జగన్‌ హస్తి నకు వెళ్లారు. అప్పుడు.. అంటే అదే రోజున దేశ రాజ ధానిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మద్యపాన నిషేధంపై పాత్రి కేయులు ప్రశ్నించారు. అప్పుడు జగన్‌ ‘‘మద్యపాన నిషే ధానికి సంబంధించి నేను చాలా క్లియర్‌గా చెప్పాను. క్రమంగా అమలు చేస్తాం. దశల వారీ పద్ధతుల్లో నిషేధి స్తామనే చెప్పాం.

మద్యంపై మాట తప్పారు..ఓటెలా అడుగుతారు!

దశల వారీ మద్య నిషేధం గాలికి

జిల్లాలోనే 158 షాపులు

పేరుకే ప్రభుత్వ మద్యం దుకాణాలు

విచ్చలవిడిగా సాగుతున్న అమ్మకాలు

భారీగా ధర పెంచేసిన ప్రభుత్వం

తాగుబోతుల జేబుకు చిల్లు

చిరుకుటుంబాల్లో కల్లోలం

నాణ్యత లేని బ్రాండ్లు

చెడిపోయిన పేదోడి ఆరోగ్యం

పెరిగిన బెల్ట్‌, సారా దుకాణాలు

నేడు సిద్ధమంటూ జగన్‌ సభలు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

అది 2019 మే 26.. తన ప్రమాణ స్వీకారానికి ప్రధా నిని,ఇతర ప్రముఖులను ఆహ్వానించడానికి జగన్‌ హస్తి నకు వెళ్లారు. అప్పుడు.. అంటే అదే రోజున దేశ రాజ ధానిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మద్యపాన నిషేధంపై పాత్రి కేయులు ప్రశ్నించారు. అప్పుడు జగన్‌ ‘‘మద్యపాన నిషే ధానికి సంబంధించి నేను చాలా క్లియర్‌గా చెప్పాను. క్రమంగా అమలు చేస్తాం. దశల వారీ పద్ధతుల్లో నిషేధి స్తామనే చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. 2024 ఎలక్షన్స్‌ సమయానికి మాత్రం కచ్చితంగా మద్యాన్ని ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌కి మాత్రమే పరిమితం చేసిన తర్వాతే ‘నేను ఓట్లు అడుగుతాను. అది మాత్రం కచ్చితంగా చెప్పి ఉన్నాను’. మేనిఫెస్టోలో కూడా కరెక్టుగా ఇదే చెప్పాను. మేనిఫెస్టోని నేను ఖురాన్‌, బైబిల్‌, భగవద్గీతగా భావి స్తాను’’ అని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే అవే మతగ్రంథాల ‘సాక్షి’గా హామీని మద్యంలో ముంచేశారు. ఇదీ జగన్‌ సర్కారు వారి బూటకపు మాటల మద్య నిషేధ కథా చిత్రమ్‌.

ఓట్లు అడగనన్నారు..

మాట తప్పి మడమ తిప్పి మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో మేనిఫెస్టోతో ఓట్లు దండుకోవడానికి ‘సిద్ధం’ అయ్యారు. మద్యం అమ్మకాలను తగ్గించడం దేవుడెరుగు!.. మద్యం అమ్మకాల ఆదాయం పైనే ప్రభుత్వాన్ని ఇన్నేళ్లు నడిపిం చడం చూస్తే జగన్‌ ఉల్టా మాటలు నమ్మిన జనాన్ని పల్టీ కొట్టించారని అర్థమవుతోంది.ఆయన 2019 మే 30న సీఎంగా ప్రమాణం చేశారు. మరో మూడు నెలల్లో ఆయన ప్రమాణానికి ఆయువు తీరుతుంది. కానీ ఆయన ఖురాన్‌, బైబిల్‌, భగవద్గీతలా భావించే మేనిఫెస్టోలోని మద్యపాన నిషేధ హామీని నేటి వరకూ అమలు చేయలేకపోయారు. పైగా మద్యంపై వచ్చే ఆదాయాన్ని పరుగులు పెట్టించారు. మద్యం అమ్మకాలను తగ్గించకపోగా ప్రోత్సహిస్తూ ‘సీసా లు వేరు వాటిలోని సారా ఒకటే’ అనే చందంగా నాణ్య తను దిగజార్చారు.ఐదేళ్లుగా రంగుసారాను ఏరుల్లా పారిం చి జనాల ఊపిరిని గుటుక్కుమనిపించారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా మద్యంపై రానున్న 15 ఏళ్లలో వచ్చే ఆదాయాన్నితాకట్టుపెట్టి వేల కోట్ల రూపా యలు అప్పు తెచ్చిన పాలకుడిగా చరిత్రలో నిలిచారు. గ తంలో ఎన్నడు లేని ధర కుటుంబాలను ఆర్థికంగా ఛిద్రం చేస్తుం టే..నాణ్యతలేని సరుకు ఆరోగ్యాన్ని నాశనం చేస్తోంది.

జేబుకు చిల్లు.. ఆరోగ్యం గుల్ల

పేదోళ్లు.. మధ్యతరగతి మందుబాబులు.. పెగ్గు అల వాటైన ప్రాణాలు. పగలంతా శ్రమించి ఓ చుక్క గొంతులో పోసుకొని సేదతీరదామను కొనే చిన్న బతుకులు.. పెగ్గు గొంతులో పోసుకోలేని దుస్థితి.జగన్‌ ప్రభుత్వం వచ్చాక రోజువారీ శ్రమలో అధికశాతం సర్కారుకు మద్యం రూపం లో ముట్టజెబుతున్నారు. ఆరోగ్యాన్నీ పణంగా పెడుతు న్నారు. ఈ ఐదేళ్లలో నాణ్యతలేని, కల్తీ మద్యం తాగడం వల్ల ప్రాణాలను సర్కారుకు అర్పించిన వారిలో అధిక శాతం పేదలే ఉన్నారు. ఒకేసారి పది మందికిపైగా చని పోయిన ఘటనలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యం పాలసీని ప్రపంచంలోనే ఎవరూ ఊహిం చని కొత్త అడ్డదార్లు తొక్కించారు. ప్రభుత్వ మద్యం దుకాణాలను తెరపైకి తెచ్చారు. ధరలను విపరీతంగా పెంచేశారు. గత ప్రభుత్వంలో గజిబిజి మద్యం పాలసీ ఉండేది కాదు. అప్పుడు క్వార్టరు(180ఎంఎల్‌) నాణ్యమైన సరుకు రూ.120కే దొరికేది. ఆ ధరను అమాంతం రూ.200 చేసేశారు. ‘జే’ బ్రాండ్లతో షాపులను నింపేశారు. తర్వాత దశల వారీగా అమ్మకాలు ఎక్కువగా ఉన్న బ్రాండ్లకు మళ్లీ క్వార్టరుకు రూ.30 అదనంగా తగిలించారు. ఇలా క్వార్టరు రూ.230 అయిపోయింది. సారా వల్ల ఆరోగ్యాలకు ఇబ్బంది కలుగుతోందని గ్రహించిన గత ప్రభుత్వ పాలకులు చీఫ్‌ లిక్కర్‌ని అందుబాటులోకి తెచ్చారు. ఈ మందు ప్రమా ణాల ప్రకారం డిస్టిలరీల్లో తయారయ్యేది. అయినా దాని ధర మాత్రం రూ.60 మించలేదు. ఇప్పుడు రంగు సారా ను, హానికర రసాయనాలను సీసాల్లో నింపి రూ.150కి విక్రయిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో లైసెన్సు పొం దిన మందు షాపులు ఉండేవి. ఎంఆర్పీపై ఒక్క రూపాయి కూడా అధికంగా వినియోగదారుల వద్ద నుంచి తీసుకో కుండా ప్రభుత్వమే దుకాణదారులకు 15 శాతం కమిషన్‌ ఇచ్చేది.వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ విధానాన్ని తీసేసింది. అసలే ఎంఆర్పీ అధికమంటే దానిపై ఎంత ఎక్కువకైనా అమ్ముకోవచ్చంటూ బార్‌లకు ధరలను ధారాదత్తం చేస్తూ ఆదేశాలు ఇచ్చేసింది. దీంతో గత ప్రభుత్వంలో రూ.60కి దొరికే చీఫ్‌ లిక్కర్‌ ఇప్పుడు బార్‌లో కొనాలంటే రూ.210 అవుతోంది. రోజంతా కష్టపడితే రూ.500 వస్తే గతంలో సుమారు రూ.400 ఇంటికి తీసుకెళ్లేవారు. మద్యం అల వాటు ఉన్న వాళ్లు ఇప్పుడు రూ.100కూడా కొంపకు చేర్చ డం కష్టమవుతోంది. దీంతో కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయి. పైగా నాణ్యత లేని మద్యం, కల్తీ మద్యం వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. దీంతో జనాలు అనారో గ్యాలపాలై ఆస్పత్రుల ఖర్చులకు అప్పులపాలు అవుతున్నా రు. లివర్‌, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు ఈ మూడే ళ్లలో విపరీతంగా పెరిగిపోయాయి.ఎన్నో ఏళ్ల నుంచి మద్యం అలవాటు ఉన్న వారికి ఈ ఐదేళ్లు విషమ పరీ క్షలు పెట్టింది.శరీరంలోని అవయవాలను నాశనం చేసింది.

దగా జగన్‌కి బుద్ధి చెబుతాం

మద్య నిషేధమంటూ దగా మాటలు చెబుతారని మహిళలు అంటున్నారు. మద్యం ధరల వల్ల మగాళ్లు అప్పులపాలు అవుతున్నారని, ఇంటికి కష్టార్జితం చేరడం లేదని ఆవేదన చెందుతున్నారు. నాణ్యతలేని మందు వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటూ కుటుంబాలను రోడ్డున పడేస్తు న్నారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ మహిళా సమాఖ్యలోని ఓ నాయకురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ‘‘కల్తీ మద్యం అమ్మకాల వల్ల పేదల బతు కులు నాశనమవుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే మద్య నిషేధం విధిస్తామని చెప్పిన జగన్‌ ఇచ్చిన హామీని అమలు చేయకపోగా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తు న్నారు. కల్తీ మద్యం వల్ల అనేక మంది చనిపోతున్నారు. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మహిళలంతా సిద్ధంగా ఉన్నారు’’ అని స్పష్టం చేశారు. దీనికి కారణం లేకపోలేద నేది నిష్టుర సత్యం. జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ అమ్మకాలు సాగించాలి. బార్లు మరో రెండు గం టలు అదనంగా అమ్ముకోవచ్చు. ఈ సమయాలు ప్రభుత్వ ఉత్తర్వులకే పరిమితం అని చెప్పొచ్చు. గ్రామాల్లో ప్రభుత్వ మద్యం షాపుల్లో రాత్రి 10 గంటల వరకూ అమ్ముతున్నారు. సారాయి దుకాణాలు, బెల్టుషాపులకు సమయమంటూ ఏమీ విధించలేదు. ఉదాహరణకు రాజమహేం ద్రవరంలో అర్ధరాత్రి ఒంటిగంటకు కూడా మద్యం దొరుకు తుందంటే పూటుగా తాగించడంలో పాలకుల కృషిని కచ్చితంగా తూర్పారబట్టాల్సిందే.

మళ్లీ సారా కోరల్లో పేదోడు

వైసీపీ ప్రభుత్వం వచ్చాక మళ్లీ సారా మహమ్మారి కోరల్లో పేదోడు చిక్కుకున్నాడు. ప్రభుత్వ మద్యం దుకా ణాల్లో రంగుసారా.. బయట రంగులేనిసారా నిర్విరా మంగా లభ్యమవుతోంది. సారా అరికట్టడానికి ఎస్‌ఈబీ అనే విభాగాన్ని వైసీపీ ప్రభుత్వం సృష్టించినా ఆ మేరకు ఫలితాలు కానరాని పరిస్థితి. దీంతో పోలీసులు అడపా దడపా తలచుకుంటేనే వందల లీటర్ల సారా, బెల్లం ఊట బయపడుతోంది. గత ప్రభుత్వంలో నాణ్యమైన మందును చీఫ్‌ పేరుతో రూ.60కే క్వార్టరు అందుబాటులోకి తేవడంతో సారా వాడకం గణనీ యంగా తగ్గింది. దీంతో తయారీదారులు కనుమరుగ య్యారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మళ్లీ వారి వ్యాపా రం మూడు ప్యాకెట్లు ఆరు సీసాలు అనే మాదిరిగా నడుస్తోంది. చీఫ్‌కి సారాకి నాణ్యతలో తేడా లేకపో వడం.. ధరల్లో భారీగా వ్యత్యాసం ఉండడంతో పేదలు సారావైపు మళ్లీ విపరీతంగా మళ్లారు. వేల లీటర్లలో సారా తయారు అవుతూ పట్టణాలకు సైతం సరఫరా అవుతోంది. చాలా చోట్ల సారా దుకాణాలు బెల్టుషా పులుగానూ అప్‌గ్రేడ్‌ అయ్యాయి. దీంతో ప్రభుత్వ మద్యం, సారా రెండూ అక్కడే లభ్యమవు తున్నాయి. మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం పెంపుపై తీవ్రంగా దృష్టి సారిస్తున్న ప్రభుత్వం టార్గెట్లు పెట్టి మరీ ఎక్సైజ్‌ శాఖపై బాగా ఒత్తిడి పెంచుతోంది. పండుగల వేళ అది మరీ అధికరం. దీంతో జనాలతో పూటుగా తాగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 137 మద్యం దుకాణాలు, 21 బార్లలో మద్యం లభ్యమవుతోంది. వీటిలో అధికంగా జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంలోనే ఉన్నాయి. 19మండలాల్లో 158మద్యం దుకాణాలు చాలవన్నట్టుగా వాక్‌ఇన్‌ స్టోర్స్‌ని ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇప్పుడు వీటికి బెల్టుషాపులు జతకలిశాయి. గతంలో మందు కావాలంటే ప్రభుత్వం లైసెన్సు ఇచ్చిన షాపునకు వెళ్లి కొనుక్కోవాల్సిందే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గడప గడపకూ మందు అందాలన్నదే జగన్‌ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణం.. వాక్‌ఇన్‌ స్టోర్స్‌.. బార్లు.. ఆ పది అడుగులు కూడా వేయలేమనంటే ఇంటి సమీపంలోనే బెల్టు షాపు. అక్కడ కొనుక్కొనేంత డబ్బులు లేవంటే దగ్గలోరే సారాయిదుకాణం. ఇవన్నీ కలుపుకొంటే జిల్లాలో సారాయి దుకాణాలు, బెల్టుషాపులు కలిపి వందల్లో నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా అందుబాటులో ఉన్న అన్నిచోట్లా మద్యం లభ్యమవుతోంది. జిల్లాలో మద్యం అమ్మకాలు నెలకు రూ.100 కోట్లు దాటాయంటే జనం సొమ్ము ఎంత పెద్ద మొత్తంలో ఖజానాకు చేరుతోందో అర్థం చేసుకోవచ్చు.

Updated Date - Mar 11 , 2024 | 12:25 AM