గోపాలపురంలో మద్దిపాటికి గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Mar 08 , 2024 | 01:01 AM
టీడీపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా కోసం కసరత్తు జరుగుతోంది. బీజేపీతో పొత్తు ఖరారవుతున్నట్టు చెబుతు న్నారు.
రాజమహేంద్రవరం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా కోసం కసరత్తు జరుగుతోంది. బీజేపీతో పొత్తు ఖరారవుతున్నట్టు చెబుతు న్నారు.జిల్లాలో అభ్యర్థులను త్వరలోనే ప్రకటించనున్నారు. గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకట్రాజు పేరు మొదట నుంచి నలుగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గోపాలపురం ప్రాంతంలో పర్యటిం చినపుడు వెంకట్రాజు పేరు ప్రస్తావించారు. దేవరపల్లిలో సభలో పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడుతో పాటు పలువురు పార్టీ నేతలు వెంక ట్రాజును మంచి మెజార్టీతో గెలిపించాలని అప్పట్లో పిలుపునిచ్చారు. అప్పటి నుంచి ఆయన పనిచేసుకుం టున్నా కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆయనను మార్చాలని కొందరు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.దీంతో ప్రజలు కొంత అయోమ యానికి గురయ్యారు. చివరకు గురువారం అధిష్ఠానం వెంకట్రాజుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక కొవ్వూరు ఒకటే పెండింగ్‌లో ఉంది. రాజమహేంద్ర వరం రూరల్‌కు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిడద వోలుకు జనసేన నేత కందుల దుర్గేష్ అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు.ఇవి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రెండో జాబితాలో వీరి పేర్లు ప్రకటించనున్నారు.