Share News

రాజమహేంద్రవరం లోక్‌సభ ఉమ్మడి అభ్యర్థి పురందేశ్వరి?

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:48 AM

టీడీపీ-జనసేన- బీజేపీ పొత్తు ఖరారవు తుందని..దీనిలో భాగంగా బిజెపి రాజమహేం ద్రవరం లోక్‌సభను కూడా కోరుతున్నట్టు ప్రచా రం జరుగుతోంది. ఇదే ఖాయమైతే ఈ లోక్‌సభ స్థానం నుంచి ఎన్‌టీఆర్‌ కుమార్తె, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేసే అవ కాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

 రాజమహేంద్రవరం లోక్‌సభ  ఉమ్మడి అభ్యర్థి పురందేశ్వరి?
పురందేశ్వరి

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

టీడీపీ-జనసేన- బీజేపీ పొత్తు ఖరారవు తుందని..దీనిలో భాగంగా బిజెపి రాజమహేం ద్రవరం లోక్‌సభను కూడా కోరుతున్నట్టు ప్రచా రం జరుగుతోంది. ఇదే ఖాయమైతే ఈ లోక్‌సభ స్థానం నుంచి ఎన్‌టీఆర్‌ కుమార్తె, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేసే అవ కాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ వర్గాల్లో ఆనందం పెరిగింది. గతంలో ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి గెలిచిన సందర్భాలు ఉన్నా యి. జిల్లాలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో కొంత వరకూ స్పష్టత ఉన్న సంగతి తెలిసిందే. కానీ పార్లమెంట్‌ నియోజకవర్గం అభ్యర్థి విషయంలో ఇంతవరకూ స్పష్టత లేదు. గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన మాగంటి రూప తర్వాత నియోజకర్గంలో తిరగలేదు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షనేత లేనట్టుగా ఉంది. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కెఎస్‌ జవహర్‌ వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తో పొత్తు ఉంటే రాజమహేంద్రవరం నుంచి బీజేపీ పోటీ చేస్తుందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. రెండురోజులుగా చంద్రబాబు, పవన్‌ ఢిల్లీలోని బీజేపీ పెద్దలు అమిత్‌షా, నడ్డాలతో చర్చించిన సంగతి తెలిసిందే. పొత్తు ఖరారైనట్టు, సీట్ల విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. బిజెపి అడిగే పార్లమెంట్‌ సీట్లలో రాజమహేంద్ర వరం కూడా ఉండడం గమనార్హం. టీడీపీ ఏర్పడిన తర్వాత 1984 నుంచి 2019 వరకూ జరిగిన పది లోక్‌ సభ ఎన్నికల్లో టీడీపీ మూడు సార్లు, బీజేపీ రెండు సార్లు, కాంగ్రెస్‌ నాలుగుసార్లు, వైసీపీ ఒకసారి గెలిసింది. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తే గెలుపు అనుకూల ంగానే ఉంటుందనే అభిప్రాయం ఉంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా డా. గూడూరి శ్రీనివాస్‌ ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ టీడీపీ నుంచి బొడ్డు వెంకటరమణచౌదరితో పాటు పలువురు టికెట్‌ ఆశించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం బీజేపీకి కేటాయిస్తున్నట్టు ప్రచారం జరగడంతో పురందేశ్వరినే ఇక్కడ అభ్యర్థిగా ఉంటారనే ప్రచారం జరుగుతోంది.

Updated Date - Mar 09 , 2024 | 12:48 AM