Share News

గ్రామస్వరాజ్యమే ధ్యేయం: మద్దిపాటి

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:42 AM

గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా గ్రామాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్టు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అన్నారు. మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ, శిలాఫలకాలు గురువారం ఆవిష్కరిం చారు.

గ్రామస్వరాజ్యమే ధ్యేయం: మద్దిపాటి
దేవరపల్లిలో శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మద్దిపాటి

దేవర పల్లి, అక్టోబరు 24: గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా గ్రామాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్టు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అన్నారు. మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ, శిలాఫలకాలు గురువారం ఆవిష్కరిం చారు. ముందుగా దేవర పల్లిలో బాలదుర్గమ్మ ఆలయంలో టీడీపీ నాయ కులు ఉప్పులూరి రాంబాబు, పిన్నమనేని నవీన్‌, నందిగాం శ్రీధర్‌, అనపర్తి వాసు, ఎమ్మెల్యేగా మద్దిపాటి గెలుపొందితే బాలదుర్గమ్మ ఆలయం లో పటికబెల్లంతో తులాభారం నిర్వహిస్తామని మొక్కుకున్నారు. ఆ మొక్కుబడి తీర్చారు. మం డలంలో రూ.3.50 కోట్లతో దేవరపల్లి, రామన్నపా లెం, ధూమంతన గూడెం, కృష్ణంపాలెం, లక్ష్మీపు రం, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లకు భూమిపూజ నిర్వహించి శిలాఫల కాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మద్దిపాటి మాట్లాడుతూ నియోజక వర్గంలో రూ.25 కోట్లతో పలు అభివృద్ధి కార్య క్రమాలు చేపట్టామని, పల్లెల్లో పండుగ కార్యక్ర మంలో భాగంగా 85పంచాయతీల్లో అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. కార్యక్రమాల్లో జనసేన ఇన్‌ఛార్జి సువర్ణరాజు, ఎంపీపీ కేవీకే దుర్గారావు, జడ్పీటీసీ స్వర్ణలత, ఆండ్రూ అనీల్‌, గన్నమని హరికృష్ణ, కొయ్యలమూడి చినబాబు, గద్దే సుబ్ర హ్మణ్యం, ఉప్పులూరి రాంబాబు, కొఠారు ధృవ కాంత్‌, పరిమి శ్రీరామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 12:42 AM