గంగిరెద్దుల..జీవన యాత్ర!
ABN , Publish Date - Oct 28 , 2024 | 01:23 AM
గంగిరెద్దు... నోరులేని మూగజీవి.. అయి తేనేమి కొన్ని కుటుంబాలకు అదే జీవనాధా రం. అందుకే వారికి గంగిరెద్దంటే ప్రాణంతో సమానం. వారు చిరిగిన వస్త్రాలు ధరించినా గంగిరెద్దుని మాత్రం నిత్య పెళ్లి కొడుకులా అలంకరిస్తారు.
ఫ గంగిరెద్దుల వారికి ఇదే జీవనాధారం
ఫ తరతరాలుగా ఇదే వృత్తితో జీవనం
ఫ డోలు, సన్నాయిలతో కోలాహలం
ఫ ప్రతి ఇల్లు సిరి సంపదలతో విరజిల్లాలని దీవెన
ఫ వారు మాత్రం పాత వస్త్రాలకే పరిమితం
ఫ ఇదీ డూడూ బసవన్నల బతుకు పోరాటం
(చింతూరు-ఆంధ్రజ్యోతి)
గంగిరెద్దు... నోరులేని మూగజీవి.. అయి తేనేమి కొన్ని కుటుంబాలకు అదే జీవనాధా రం. అందుకే వారికి గంగిరెద్దంటే ప్రాణంతో సమానం. వారు చిరిగిన వస్త్రాలు ధరించినా గంగిరెద్దుని మాత్రం నిత్య పెళ్లి కొడుకులా అలంకరిస్తారు. ఎందుకంటే అదే వారికి పెద్ద కొడుకంట. గంగిరెద్దు లేకుంటే తమకు జీవ నమే లేదంటున్నారు. తరాలుగా తమ బతు కు ఇదేనంటున్నారు. పొట్టకూటి కోసం ఇల్లు, వాకిలి వీడి ఊరూరా తిరగాల్సిన దయనీయ స్థితి వారిది. అమ్మగారికి దండం పెట్టు... అయ్యగారికి దండం పెట్టు అంటుంటే గంగి రెద్దు ఆడడం చూడముచ్చటగా ఉంటుంది. కృష్ణా జిల్లా తిరువూరు మండలం గానుగపా డులో పలు కుటుంబాలు గంగిరెడ్లపై ఆధార పడి జీవిస్తున్నాయి. వారిలో కొన్ని కుటుం బాలు ఏటా చింతూరు ఏజెన్సీకి వస్తాయి. ఈసారి సుమారు పది కుటుంబాలు ఇక్కడికి వచ్చాయి. దసరా నుంచి సంక్రాంతి వరకు ఆ కుటుంబాలు ఇక్కడి ప్రతి పల్లెల్లో తిరుగు తాయి. ఈ క్రమంలో ఎవరికి తోచింది వారికి ఇస్తుంటారు. రైతులు చేటలో ధాన్యం పోసి గంగిరెద్దుకు తినిపిస్తారు. అలా చేస్తే పంట లు బాగా పండుతాయని వారి నమ్మకం. ఇం ట్లోని పాత వస్త్రాలను గంగిరెద్దు అలంకర ణకు ఇస్తారు. రైతులు చేసిన దాన, ధర్మాలకు సంతోషం వ్యక్తం చేస్తూ బసవన్నలు దొరగారి ఇల్లు సిరి సంపదలతో కళకళలాడాలని దీవి స్తాయి. కాగా బసవయ్యల బతుకులు మాత్రం చిరిగిన వస్త్రాల వద్దే ఆగిపోతుంటా యి. ఊరూరా ప్లాస్టిక్ టార్పాలిన్లతో డేరాలు వేసుకొని అక్కడే వంట-వార్పు చేసుకుంటా రు. చిమ్మచీకట్లోనే వారి కాపురం. వేకువనే మకాం నుంచి బయల్దేరి మధ్యాహ్నం వరకు ఇంటింటా యాచించడం వారి జీవన శైలి. ఇదంతా ఒక ఎత్తయితే గంగిరెద్దుకు శిక్షణ ఇప్పించడం మరో ఎత్తు. మంచి జాతి గిత్తని ఎంచుకోవడం మొదటిది. తర్వాత ప్రకాశం జిల్లా రాజనెల్లూరులో గంగిరెద్దులకు శిక్షణ ఇచ్చే గురువు వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. శిక్షణ ఇచ్చేందుకు గురువుకు దక్షిణ ఇచ్చుకో వాల్సి ఉంటుంది. ఒకింత స్థాయిని మించి (సుమారు రూ.25వేల దాకా) దక్షిణ ఉన్నప్ప టికీ తప్పని స్థితి. శిక్షణ రెండు నెలల నుంచి ఒక్కోమారు ఏడాది కూడా ఇవ్వాల్సి ఉంటుం ది. తరతరాలుగా ఇదే తమ జీవితం కావ డంతో ఊరూరా కాలినడకన తిరిగి తిరిగి మోకాళ్లు అరిగిపోయి చివరకు నడవడానికి ఓపిక లేని స్థితిలో అవస్థలు పడుతుంటామని బసవయ్యలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అయినా ఈ వృత్తి తప్ప తమకు మరో దారి లేదంటున్నారు. ఏడాదిలో మూడు నుంచి నాలుగు నెలలపాటు పల్లెల్లో యాచించి మిగి లిన కాలంలో తమ ఊరిలో కూలి పనులకు వెళ్తామంటున్నారు. తమ కుటుంబాల్లో ఉద్యో గం చేసేవాళ్లే లేరని నిరాశ చెందుతున్నారు. ఆ భాగ్యం వారికెపుడు కలుగుతుందో మరి.