Share News

ప్రాణం తీసిన స్నానం సరదా

ABN , Publish Date - May 12 , 2024 | 01:09 AM

సర దాగా స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ గోదా వరిలో మునిగి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన బొబ్బర్లంక గ్రామంలో శనివారం జరిగింది.

ప్రాణం తీసిన స్నానం సరదా

గోపాలపురం/ఆత్రేయపురం, మే 11: సర దాగా స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ గోదా వరిలో మునిగి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన బొబ్బర్లంక గ్రామంలో శనివారం జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకా రం.. గోపాలపురం మండలం దొండపూడికి చెందిన గ్రరే వీరవెంకట శశికుమార్‌(18) ఇద్దరు స్నేహితులతో కలిసి సెల్‌ఫోన్‌ రిపేర్‌ చేయించుకునేందుకు శనివారం ఉదయం రాజమహేంద్రవరం వెళ్లారు. ఫోన్‌ రిపేర్‌ చేయించుకుని ఇంటికి తిరిగొస్తూ మార్గమ ధ్యంలో ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద ఆనకట్ట వద్ద బొబ్బర్లంక పరిధిలోని అన్నపూర్ణమ్మ గుడిసమీపంలో నదీ స్నానానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా జారిపడి శశికుమార్‌ మునిగిపోయాడు. స్నేహితులిద్దరూ గ్రహించి ఒడ్డుకు చేరుకుని కాపాడేం దుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్థానికులు గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆత్రేయపురం ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - May 12 , 2024 | 01:09 AM