Share News

కొత్తగా ..కొంగొత్తగా

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:37 AM

కొత్తగా..కొంగొత్తగా 2024 సార్వత్రిక ఎన్నికలకు నూ తన పద్దతుల్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆచరణలోకి తీసుకురాబోతోంది.

కొత్తగా ..కొంగొత్తగా

సార్వత్రిక ఎన్నికలకు నూతన పద్దతులు

పెద్దాపురం, మార్చి 26 : కొత్తగా..కొంగొత్తగా 2024 సార్వత్రిక ఎన్నికలకు నూ తన పద్దతుల్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆచరణలోకి తీసుకురాబోతోంది. పోలింగ్‌ శాతాన్ని గణనీయంగా పెంచడంతోపాటు యువ ఓటర్లందరూ ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రోత్స హించడం, ఎన్నికల సందర్భంగా జరిగే అక్రమా లను నిలువరించేందుకు పటిష్ఠచర్యలు తీసుకుంటోంది. తొలిసారి 85 ఏళ్లుపైబడి మంచం కదల్లేని వృద్ధులు, దివ్యాంగులకు ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించు కునే అవకాశాన్ని కల్పించనున్నారు.

యూత్‌ పోలింగ్‌ కేంద్రం..

యువ ఓటర్లు ఎక్కువమంది ఉన్న ప్రాంతాలను గుర్తించి యు వకుల కోసమే ప్రత్యేకంగా నియోజకవర్గానికి ఒకటిచొప్పున పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేయ నున్నారు. ఈకేంద్రంలో పోలింగ్‌ విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది కూడా యువకులే ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. యువఓటర్లను పోలింగ్‌ కేంద్రాల వైపు నడిపించే లా వారిని ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో మహిళలు, దివ్యాంగుల ఓటింగ్‌ శాతం పెంచేందుకు వారి కోసమే ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఈసారి యువ ఓటర్లపై ఈసీ గురిపెట్టింది.

ఇంటివద్దే ఓటుహక్కు...

2019 సార్వత్రిక ఎన్నికల్లో సాధారణ ఓటర్లు అందరూ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఈసారి 85 ఏళ్లు పైబడి మంచంపై నుంచి కదల్లేని స్థితిలో ఉన్నవారు, దివ్యాంగు లకు ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఫారం 16డీ ద్వారా కల్పించనున్నారు. హోమ్‌ ఓటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల అధికారులు పరిశీలించి అవకాశం ఇవ్వనున్నారు.

ప్రతి పైసాకు లెక్క..

ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయానికి సంబంధించి ప్రతీ పైసాకు ఈసారి లెక్క ఉండబోతోంది. తొలిసారి నియోజకవర్గానికి ఒక అకౌం టింగ్‌ బృందాన్ని ఏర్పాటుచేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులు తాము చేసిన వ్యయానికి సంబంధించిన వివరాలన్నీ ఎన్నికల వ్యయ పరిశీలకులకు 15 రోజులకు ఒకసారి సమర్పించాల్సి ఉండేది. ప్రస్తుతం ప్రచారంతోపాటు ఇతరత్రా కార్యక్రమాలకు చేస్తు న్న వ్యయాన్ని పరోక్షంగా అకౌంటింగ్‌ బృందాలు పరిశీలించనున్నాయి.

పోలింగ్‌ కేంద్రం ఎక్కడో తెలుసుకోవచ్చు..

గత ఎన్నికల్లో జిల్లాలో 80శాతం పోలింగ్‌ నమోదైంది. ఈసారి 95శాతానికి పైబడి నమోదయ్యేలా ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నారు. ఓటర్లకు తమ ఓటు ఎక్కడుందో తెలియకపోవడం, కుటుంబ సభ్యుల ఓట్లు వేర్వేరు చోట్ల ఉండడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారని ఎన్నికల సంఘం గుర్తించింది. ఈనేప థ్యంలో మై ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈయాప్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసుకుని ఓటరు ఎపిక్‌ కార్డు నంబరు నమోదుచేస్తే ఏ పోలింగ్‌ కేంద్రంలో ఓటువేసే అవకాశం ఉందనే వివరాల్ని ఇట్టే తెలిసిపోతాయి. ఫోన్‌ అనుసంధానిత ఐచ్ఛికాన్ని దీనికి ప్రత్యేకంగా ఇచ్చారు.

Updated Date - Mar 27 , 2024 | 12:37 AM