Share News

నేటి నుంచి క్రియ చిన్నారుల పండుగ

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:45 AM

సర్పవరం జంక్షన్‌, డిసెంబరు 27(ఆంధ్ర జ్యోతి): 11వ రాష్ట్రస్థాయి అంతర పాఠశాలల సాంస్కృతిక పోటీల క్రియ పిల్లల పండుగ డిసెంబరు 28 నుంచి 29 వరకు రెండురోజుల పాటు కాకినాడ జేఎన్‌టీయూకేలో నిర్వహించేం దుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి చిన్నారుల పం

నేటి నుంచి క్రియ చిన్నారుల పండుగ

జేఎన్‌టీయూకేలో ఏర్పాట్లు, ముఖ్య అతిథిగా డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ

సర్పవరం జంక్షన్‌, డిసెంబరు 27(ఆంధ్ర జ్యోతి): 11వ రాష్ట్రస్థాయి అంతర పాఠశాలల సాంస్కృతిక పోటీల క్రియ పిల్లల పండుగ డిసెంబరు 28 నుంచి 29 వరకు రెండురోజుల పాటు కాకినాడ జేఎన్‌టీయూకేలో నిర్వహించేం దుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి చిన్నారుల పండుగ ప్రారంభంకానుంది. ముఖ్య అతిథిగా లోక్‌సత్తా వ్యవస్థాపకుడు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ హాజరు కానున్నారు. రా ష్ట్రం నలుమూలల నుంచే కాక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నుంచి ఈ పోటీల్లో పాల్గొనేందుకు సుమారు 10వేలు మంది వరకు విద్యార్థులు హాజరుకావచ్చని నిర్వాహకులు తెలిపారు. 2రోజుల పాటు 28 విభాగాల్లో నిర్వహించనున్న చిన్నారుల పండుగలో తొలి రోజు శనివారం చి న్నారులకు నాటికలు, శాస్త్రీయ నృతం, కోలాటం, ఏకపాత్రాభినయం, పాటలు, పోస్టర్‌ ప్రజెంటేషన్‌, సైన్‌ ప్రయోగాలు, గ్రూపు డిబేట్‌, గణితం, క్విజ్‌, వ్యాసరచన, కథా రచన, విశ్లేషణ, అంతర్జాలంలో అన్వేషణ జరుగుతాయి. ఆదివారం జానపద నృత్యం (బృందం), విచిత్ర వేషధారణ, బుర్ర కథ, కోలాటం, ప్రాజెక్టు పని, వాద్య సంగీతం, మాటలు, కథ చెప్పడం, స్పెల్లింగ్‌, చిత్రలేఖనం, సృజనాత్మక వస్తువుల తయారీ, మైమ్‌, మట్టితో బొమ్మలు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 5వ తరగతి వరకు సబ్‌ జూనియర్స్‌, 6,7 తరగతులు జూనియర్స్‌ విభాగం.. 8, 9, 10వ తరగతులు సీనియర్స్‌ విభాగాల్లో పోటీలు జరుగుతాయని నిర్వాహకులు చెప్పారు.

Updated Date - Dec 28 , 2024 | 12:46 AM