Share News

కొవ్వూరులో వీడని టెన్షన్‌!

ABN , Publish Date - Sep 23 , 2024 | 12:50 AM

కొవ్వూరు శివారులోని తుని పేట, రాజీవ్‌ కాలనీ (మత్స్య కార) ప్రాంతాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. గణేశ్‌ శోభాయాత్రలో ఆకతాయిలు తెచ్చిన గొడవ చినికి చినికి రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు రగిల్చింది.

కొవ్వూరులో వీడని టెన్షన్‌!
కొవ్వూరులో శ్రీరామకాలనీ(తుని కాలనీ)

ఇంకనూ చల్లారని గొడవలు

19న ఇరువర్గాల మధ్య ఘర్షణ

మూడు రోజులైనా అదే తీరు

100 మందిపై కేసులు నమోదు

ఇరువర్గాల్లో 50 మందికి నోటీసులు

200 మంది పోలీసుల పహరా

రోడ్డు వేస్తేనే సమస్యకు పరిష్కారం

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)/కొవ్వూరు

కొవ్వూరు శివారులోని తుని పేట, రాజీవ్‌ కాలనీ (మత్స్య కార) ప్రాంతాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. గణేశ్‌ శోభాయాత్రలో ఆకతాయిలు తెచ్చిన గొడవ చినికి చినికి రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు రగిల్చింది. కొవ్వూరు రూరల్‌ ఎస్‌ఐ కె.శ్రీహరికి గాయాలయ్యే వరకూ వెళ్లింది. గొడవ మూ డు రోజుల ముందే మొదలైంది. దీనిని పసిగట్టి గద్దించడంలో అటు పోలీసులు, ఇటు ఇరువర్గాల పెద్దలు విఫలం కావడంతో పరిస్థితి తీవ్రమైంది.చిన్న తగాదా సర్దుబాటు చేయడంలో కాస్త ఆదమరుపుగా ఉండడం పెద్ద రగడకు దారితీ సింది. ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉన్నా ఆ రెండు కాలనీల్లో ఏ క్షణంలో ఏం జరు గుతుందో అనే టెన్షన్‌పై ‘ఆంధ్రజ్యోతి’ గౌండ్‌ రిపోర్ట్‌.

మూడు రోజుల కిందట జరిగిందిదీ!

ఈ నెల 19న రాత్రి సమయంలో రాజీవ్‌ కాలనీలోని గణేశ్‌ విగ్రహాన్ని నిమజ్జనం కోసం శోభాయాత్రగా తీసుకెళుతు న్నా రు. ఈ కాలనీ నుంచి సాధారణంగా హైవేకు తుని పేట (ఎస్సీ కాలనీ), శ్రీరామ కాలనీ మధ్యలోని రోడ్డులో రాకపోకలు సాగిస్తుంటారు.ఆ రోజు కూడా పోలీసులు కేటాయించిన రూట్‌ మ్యాప్‌ ప్రకారం అదే దారిలో వెళుతున్నారు. సరిగ్గా ఎస్‌ టర్నిం గ్‌ దగ్గరకు వచ్చేసరికి తుని కాలనీ కుర్రాళ్లు కొందరు శోభా యాత్ర చేస్తున్న వాళ్లను కవ్వించడంతో రాళ్లతో దాడికి దిగారు. ఆ రోజు ఎస్‌ఐకి రాయి తగిలి గాయమైంది. ఎస్పీ నర సింహ కిశోర్‌ సుమారు 200 మంది పోలీసు సిబ్బందితో సంఘటనా ప్రదేశానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.ఆ మరు సటి రోజున తుని పేటకు చెందిన నలుగురు యువకులు ఇద్ద రు మత్స్యకార యువకులపై దాడి కి దిగారు.ఈ విషయం తెలి యడంతో సుమారు 200 మంది మత్స్యకారులు తుని పేటలోకి వెళ్లి ఆటో, 3 ద్విచక్ర వాహనాలను పాక్షికంగా ధ్వంసం చేశారు.

35 ఏళ్ల కిందట వచ్చి.. స్థిరపడి..

తుని ప్రాంతం నుంచి పొగాకు బ్యారన్లలో పనిచేయడానికి తుని నుంచి కొందరు సుమారు 38 ఏళ్ల కిందట ఈ ప్రాం తానికి వచ్చారు.అందువల్ల దీనిని తుని పేట అంటారు. చిత్రం ఏమిటంటే.. మత్స్యకారులు ఉపాధి నిమిత్తం దాదాపు 33 ఏళ్ల కిందట తుని ప్రాంతం నుంచే ఇక్కడికి వచ్చారు. అప్పటి నుంచీ ఏ ఇబ్బందీ లేకుండా జీవనం సాగిస్తున్నారు. ఒకప్పుడు తునికాలనీ, మత్స్యకార కాలనీకి మధ్య రోడ్డు లేక తీవ్ర ఇబ్బంది పడేవాళ్లు. ఎన్నో పోరాటాల తర్వాత సిమెంటు రోడ్డు వేశారు. దీంతో రాజీవ్‌ కాలనీ నుంచి ఇటు, తుని పేట నుంచి అటు రాకపోకలు సులభమయ్యాయి. తదనంతర పరిణామాల నేప థ్యంలో రెండు కాలనీల వాళ్ల మధ్య సఖ్యత లేకపోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. రెండు కాలనీల వాళ్లు తుని పేట మీదుగానే వెళ్లాల్సి రావడంతో వెళ్లినప్పుడు వచ్చి నప్పుడు ఏదో ఒక విధంగా గొడవ పెట్టుకుంటున్నారు.

రోడ్డు వేస్తేనే సమస్యకు పరిష్కారం

మత్స్యకార కాలనీకి చివరన అటు హైవేకు, ఇటు గోదావరి గట్టుకు వెళ్లే రోడ్డు ఉన్నా ఆ దారుల్లో సరైన సదుపాయాలు లేవు. పైగా గోదావరి గట్టు దారిలో వెళితే చుట్టూ తిరిగి వచ్చే పరిస్థితి ఉంది. దీంతో స్కూలు పిల్లలకు, వివిధ పనులపై వెళ్లే మత్స్యకారులకు దూరాభారం. దీంతో కచ్చితంగా తుని కాలనీ చివర వీధిగుండా వెళ్లాల్సిందే. కవ్వింపు స్థాయిలో ఉండే గొడ వలు పోలీసుల పహరా వరకూ వచ్చాయి. అందువల్ల గతంలో ప్రతిపాదించిన మాదిరిగా మత్స్యకార కాలనీ చేరువలో ఉన్న చెరువు పక్కగా కొవ్వూరు ప్రధాన రహదారిని కలుపుతూ సుమారు ఒక కిలోమీటరు రోడ్డు వేస్తే సమస్యకు చాలా వరకూ పరిష్కారం దొరికే అవకాశం ఉంది. లేకపోతే రానున్న రోజుల్లో కూడా ఇక్కడ పరిస్థితులు సమస్యలను కొనితెచ్చే విధంగానే ఉంటాయని స్థానికులు చెబతున్నారు.

200 మందితో పోలీస్‌ పహరా

ఈ ప్రాంతాల్లో సుమారు 200 మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేశారు.ఎస్పీ స్వీయ పర్యవేక్షణలో డీఎస్పీ దేవ కుమార్‌ ఆధ్వర్యంలో కొవ్వూరు టౌన్‌ సీఐ పి.విశ్వం, రూరల్‌ సీఐ విజయ్‌ కుమార్‌, దేవరపల్లి సీఐ శేఖర్‌బాబు, సీఐ పవన్‌ కుమార్‌ రాజమండ్రి, కొవ్వూరు సబ్‌-డివిజన్ల సిబ్బందితో పహ రా కాస్తున్నారు.పలు వీధుల్లో పోలీసులను మోహరించారు. ఇరువర్గాలకు కౌన్సెలింగ్‌ చేస్తున్నారు.సుమారు 100 మందికి నోటీసులు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే 50 మందికి సెక్షన్‌ 41 ప్రకారం నోటీసులు అందజేసి విచారణకు హాజరు కావాలన్నారు.అల్లర్లు చెలరేగిన రోజు వీడియోలు సేకరించారు. ఐదు రకాల కేసులను బనాయిస్తున్నట్లు తెలుస్తోంది.10 మంది యువకుల అసాంఘిక కార్యకలాపాల వల్ల ఈ రెం డు కాలనీ ల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుస్తోంది.ప్రధా నంగా వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

రోడ్డు కావాలంటే వేస్తాం..

ఇప్పటికే తునికాలనీ వాళ్లను పిలిచి మాట్లాడాం. మత్స్యకారులతోనూ మాట్లాడతాం. ఇరువర్గాలూ సంయ మనం పాటించాలి.గొడవల సంస్కృతి మంచిది కాదు.. పిల్లల జీవితాలు ఇబ్బందుల్లో పడ తాయి. ఒకవేళ రోడ్డు, డ్రైన్ల వంటివి వేస్తే సమస్యలకు పరిష్కారం దొరుకే అవకాశం ఉంటే కచ్చితంగా త్వరితగతిన రోడ్డు వేయడానికి చర్యలు తీసుకుంటాం. ఆయా కాలనీల్లోని పెద్దలు కూడా యువకుల నడతను గమనిస్తూ తీవ్ర ప్రవర్తన ఉంటే మందలిస్తూ ఉండాలి.

- ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు

సామాజిక స్పృహ అవసరం

సామాజిక స్పృహ అవసరం. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి.ఇప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతుండడం విచారకరం. రెండు కాలనీల్లో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించాం. పరిస్థితి అదుపులోనే ఉంది. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అంచనా వేస్తున్నాం. కౌన్సెలింగ్‌ చేస్తున్నాం. మరో రెండు మూడు రోజులు ఇదే మాదిరిగా బందోబస్తు ఉంటుంది. తర్వాత కొద్ది రోజుల పాటు పికెట్‌లు ఏర్పాటు చేస్తాం. శాంతి భద్రతలకు, సాధారణ జనజీవనానికి విఘాతం కలిగించే వాళ్లను విడిచిపెట్టం. అసాంఘిక వ్యక్తులను ఉపేక్షించేది లేదు. కేసులు ఎదుర్కోవాల్సిందే. - నరసింహ కిశోర్‌, ఎస్పీ

Updated Date - Sep 23 , 2024 | 12:50 AM