కోనసీమ ప్రజల రుణం తీర్చుకుంటా
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:41 AM
కోనసీమ ప్రజల రుణం తీర్చుకుంటానని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల అమలాపురం పార్లమెంటరీ అభ్యర్థి గంటి హరీష్‌మాధుర్ అన్నారు.

రాజోలు, ఏప్రిల్ 2: కోనసీమ ప్రజల రుణం తీర్చుకుంటానని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల అమలాపురం పార్లమెంటరీ అభ్యర్థి గంటి హరీష్‌మాధుర్ అన్నారు. మంగళవారం శివకోటిలో మంగెన గంగయ్య కాపు కల్యాణ మండపంలో రాజోలు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా హరీష్, రాజోలు నియోజకవర్గ అభ్యర్థి దేవ వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీవేమా, రాజోలు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు చిటికెల రామ్మోహనరావుపాల్గొన్నారు. ఈసందర్భంగా హరీష్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు సమన్వయంతో పనిచేస్తే గెలుపు తథ్యమన్నారు. కోనసీమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన రైలు కూతను త్వరలోనే తీసుకువస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ప్రజలంతా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాజోలు అసెంబ్లీ అభ్యర్థి దేవ వరప్రసాద్ మాట్లాడుతూ ప్రతీ గ్రామం నుంచి ప్రతీ పార్టీ నుంచి 15మంది సభ్యుల కోఆర్డినేషన్‌తో ముందుకు వెళతామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కేతా శ్రీను, గుండుబోగుల పెదకాపు, మంగెన భూదేవి, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల టీడీపీ అధ్యక్షులు గుబ్బల శ్రీనివాస్, అడబాల యుగంధర్, ముప్పర్తి నాని, ప్రధాన కార్యదర్శి చాగంటి స్వామి, సర్పంచ్ చెల్లుబోయిన హెలీన, వైస్ ఎంపీపీ పొలమూరి శ్యామ్‌బాబు, బందెల పద్మ, పినిశెట్టి బుజ్జి, రాపాక నవరత్నం, గుండాబత్తుల తాతాజీ, మానేపల్లి బాలాజీవేమా, బోళ్ల రాజేష్, చెల్లుబోయిన శ్రీనివాస్, బోళ్ల వెంకటరమణ, అడబాల విజయ్, రావి మురళీ, కసుకుర్తి త్రినాథస్వామి, గాలిదేవర వెంకన్నబాబు, కడలి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.