Share News

ఇంటర్‌ జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తి

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:42 AM

అమలాపురం టౌన్‌, ఏప్రిల్‌ 5: అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో చేపట్టిన ఇంటర్మీడియట్‌ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ శుక్రవారంతో ముగిసినట్టు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖాధికారి వనుము సోమశేఖరరావు తెలిపారు. మూల్యాంకన ప్రక్రియ ఐదు విడతలుగా నిర్వహించామన్నారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించి వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,33,865 జవాబు పత్రాలను 430 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు దిద్దడం

ఇంటర్‌ జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తి

అమలాపురం టౌన్‌, ఏప్రిల్‌ 5: అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో చేపట్టిన ఇంటర్మీడియట్‌ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ శుక్రవారంతో ముగిసినట్టు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖాధికారి వనుము సోమశేఖరరావు తెలిపారు. మూల్యాంకన ప్రక్రియ ఐదు విడతలుగా నిర్వహించామన్నారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించి వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,33,865 జవాబు పత్రాలను 430 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు దిద్దడం జరిగిందన్నారు. 82 మంది స్ర్కూటినైజర్లు ఆ పేపర్లను స్ర్కూట్నీ చేశారు. 82 మంది చీఫ్‌ఎగ్జామినర్లు, 13 మంది అసిస్టెంట్‌ క్యాంపు ఆఫీసర్స్‌, ఇద్దరు చీఫ్‌ కోడింగ్‌ ఆఫీసర్లు మూల్యాంకనంలో పాల్గొన్నారు. ఇంటర్మీడియట్‌ విద్యామండలి ప్రకటించిన గడువులోగా మూల్యాంకనం పూర్తిచేశామన్నారు. స్కాన్‌ ఇన్‌చార్జి, కోఆర్డినేటర్లు ఇదే కేంద్రంలో మార్కులను పోస్టు చేశారు. అధికారుల అంచనాల ప్రకారం ఈనెల 2వ వారంలో పరీక్షా ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మూడు జిల్లాలుగా ఏర్పడిన తర్వాత జిల్లాలో ఇంటర్మీడియట్‌ స్పాట్‌ వాల్యూయేషన్‌ సెంటర్‌ నిర్వహించడం ఇదే మొదటిసారని తెలిపారు.

Updated Date - Apr 06 , 2024 | 12:42 AM