Share News

కోఢీ..రెడీ!

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:53 AM

పోలీసులు కత్తి కాంతారావులే.. ముందు కత్తిదూయడం.. ఆ తరువాత చల్లబడిపోవడం వారికి అలవాటే.. ఆ నాలుగు రోజులు హడావుడి చేస్తారు.. ఆ తరువాత ఏడాదంతా ఎదురుచూస్తారు.

కోఢీ..రెడీ!
గతేడాది వేమగిరిలో బరి పక్కనే ఉన్న పోలీస్‌ జీప్‌

తొడకొడుతున్న పందెం కోడి

కత్తుల సంచులతో పందెగాళ్లు రెడీ

ప్రతి ఏడాది హెచ్చరికలతో సరి

నిద్దరోతున్న అధికార యంత్రాంగం

సంక్రాంతి మూడు రోజులూ చూస్కో

వైసీపీ నేతలకు ఆదాయ మార్గం?

ఈ సారైనా కోర్టు ఆదేశాలమలయ్యేనా?

గ్రామాల్లో సిద్ధమైన బరులు

పోలీసులు కత్తి కాంతారావులే.. ముందు కత్తిదూయడం.. ఆ తరువాత చల్లబడిపోవడం వారికి అలవాటే.. ఆ నాలుగు రోజులు హడావుడి చేస్తారు.. ఆ తరువాత ఏడాదంతా ఎదురుచూస్తారు. మళ్లీ కోడి పందేల సీజన్‌ వచ్చినప్పుడు మామూలే.. మళ్లీ కత్తి దూస్తారు.. అయితే ఏడాది నుంచి ఆ కత్తుల తయారీపై మాత్రం దృష్టి పెట్టరు. అంతా తెలిసినా మిన్నకుండిపోతారు.. చివరిలో మాత్రం అడపాదడపా కేసులు నమోదు చేసి మేమున్నామంటారు.. ఆరంభం నుంచే కోడికత్తుల తయారీ అడ్డుకుంటే చివరిలో ఈ ఇబ్బంది ఉండదు కదా అనేది జనం వాదన..

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

కోడి పందెం అంటే తాట తీస్తాం.. కత్తి కడితే కటకటాలే.. ప్రతి ఏడాదీ సంక్రాంతి సందర్భంగా అధికారులు చాలా బలంగా జారీ చేసే హెచ్చరికలివి. కానీ, ‘బరి’తెగించడం.. పందెం కోడి తొడగొట్టి మరీ కత్తికట్టించుకోవడం కళ్లముందు జరిగే ఓ రసవత్తరమైన సినిమా. ఈ సారి కూడా ఆ బొమ్మ పడుతుందని పరిస్థితులు చెబుతున్నాయి. ఈ సినిమాలో అందరూ అనుకున్నట్లు కోడి పుంజు కాదు హీరో.. దానికి కట్టే కత్తి పదునైౖన హీరో. ఈ హీరో ముందు రియల్‌ హీరోలు ప్రతి ఏడాదీ డీలా పడిపోతూనే ఉన్నారు. సంక్రాంతి వచ్చిం దంటే గోదావరి జిల్లాల పేరుచెబితే ఠక్కున గుర్తొచ్చేవి కోడి పందేలు. దీంతో కోడి పందేలకు విదేశాల నుంచి కూడా పం దెంగాళ్లు,ఆసక్తి ఉన్నవాళ్లు రెక్కలపై ఎగిరొచ్చి గోదారి జిల్లాల్లో వాలిపోతుంటారు.ఇది ప్రతి ఏడాదీ జరిగే తంతు. వాస్తవానికి సరదాలో భాగంగా పెద్ద పండుగకు కోడి పం దేలను వేయ డం పరిపాటి. అయితే క్రమంగా అది హింసతో కూడిన క్రీడ, వ్యస నంగా రూపాంతరం చెందింది. దీనికి ప్రధాన కారణం కోడి కత్తులనేది జగమెరిగిన వాస్తవం. ప్రతి ఏడాదీ వేలల్లో తయారవుతున్న కోడికత్తులపై దృష్టి సారించకుండా హెచ్చ రికలు జారీ చేస్తూ కాలయాపన చేసి చివరికి పండుగ మూడు రోజులూ కళ్లుమూసుకోవడం యం త్రాంగానికి అల వాటుగా మారిన విషయం ఎవరూ కొట్టిపారే యలేని వాస్తవం.ఈ నేపథ్యంలో కోఢీపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

ఒక్కో కత్తి రూ.700

సంక్రాంతి సీజన్‌కి కోడి పందేల కోసం వేల సంఖ్యలో కత్తులు తయారు చేస్తుంటారు. ఒక్కో కత్తి ధర రూ.300 నుంచి రూ.700 వరకూ ఉంటుంది. కత్తి కట్టే వాళ్ల వద్ద వం దల్లో కత్తులు ఉంటాయి.వాటిని ఓ బెల్డులా ఉన్న మంద పాటి వస్త్రానికి అమర్చి ఆ వస్త్రాన్ని చుట్టగా చుట్టి పందెం వద్దకు తీసుకొస్తారు.బరులు నిర్వహించేవాళ్లు రోజుకింత అని గంపగుత్తగా మాట్లాడుకుంటారు.మరికొందరు పందేన్ని బట్టి డబ్బులు తీసుకుంటారు. కత్తి కట్టే వాళ్లకు పందేనికి రూ.300 నుంచి రూ.1,000 వరకూ ముట్టచెబుతారు. కత్తి కట్టే వాళ్లకు తెలిసిన పందెంగాళ్లు అదనపు సొమ్ము కూడా చెల్లిస్తారు. కోళ్లు వందల్లో ఉంటే కత్తులు వేలల్లో ఎందుకనే అనుమానం రావొచ్చు. ఒకసారి పందేనికి వాడిన కత్తి ఆ రోజు మరో పుంజుకు కట్టరు. ఆ కత్తిని మళ్లీ సానబట్టించిన తర్వాతే వేరే పుంజుకు కడతారు. దీంతో పెద్ద బరుల్లో ఉండే కోడికత్తికట్టే వ్యక్తుల వద్ద ఒక్కో బెల్టులో కనీసం 20-30 కత్తులు ఉంటా యి. ఇలా వేలల్లో కత్తులు అందుబాటులో ఉంటున్నాయి.

కత్తులది ప్రధాన భూమిక..

కోడి పందేల్లో కత్తులది ప్రధాన భూమిక.అందుకే కోడి కత్తిని ప్రత్యేకంగా తయారు చేస్తారు.ముందు భాగంలో కత్తి.. దానికి అమర్చి కోడి కాలుకు కట్టడానికి వీలుగా ఊచ వంటి ఏర్పాటు ఉంటుంది.ఈ ఊచను ‘కూలు’ అంటారు. కత్తి, కూలు కలుపుకొని కోడి కత్తి 4 నుంచి 6 అం గుళాల పొడవు ఉంటుంది.కూలును తాడుతో కోడి కాలుకు బలంగా కడ తారు.దీంతో కత్తి బెసకడం ఉండదు.ఆపరేషన్లు చేసే సర్జికల్‌ బ్లేడుతో సమానమైన పదునుతో ఉంటాయి. ఈ కత్తులను పండుగకు రెండు నెలల ముందు నుంచే రహస్యంగా తయారు చేస్తారు. కోడి కత్తి ఎట్టి పరిస్థితుల్లోనూ వంగి పోకు ండా ఉంటుంది. కత్తి విరగాలే గానీ, వంగిపో కూడదని పం దెంగాళ్లు చెబుతారు.దీనికోసం నాణ్యత కలిగిన ముడిస రుకు వాడతారు. ఉక్కుతో తయారైన కమాను కట్టలు, రైల్వేబెడ్లు వంటివి ఉపయోగిస్తారు.ఇప్పుడు కత్తి మరిం త పదునుగా ఉండడానికి హెలీకాఫ్టర్‌ రెక్కలు తదితర విడిభాగాలను ఉపయోగిస్తున్నారని చెబుతున్నా రు.పం డుగ సీజన్‌లో కత్తి కట్టే వాళ్లకు చాలా డిమాండు ఉం టుంది.అడ్వాన్సులు చెల్లించి మరీ పందెం బరులు నిర్వ హించేవాళ్లు కాపాడుకుంటారు.కత్తి,కత్తి కట్టే తీరుపైనే పందెం గెలవడం ఆధారపడి ఉంటుందని పందెంగాళ్లు నమ్ముతారు.కత్తి కట్టి నిర్వ హించే కోడి పందేలపై నిషేధం ఉన్నా అది కాగితాలకే పరి మితమవుతోంది. ప్రాణాలు కోల్పోతున్న కోళ్లను చూస్తూ ఆవే దన చెందడం మాత్రమే జంతు ప్రేమికులకు మిగులుతోంది.

నిఘాపై కత్తి

ఈసారి కూడా పోలీసులు హెచ్చరికలతో సరిపెట్టినట్లు కనిపిస్తోంది.ఈ ఏడాది కచ్చితంగా కోర్టు ఆదేశాలను పాటి స్తామని.. కత్తి కడితే కఠిన చర్యలేనని ఉన్నతాధికారులు వల్లెవేసినా ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే గ్రామా ల్లో చాటుమాటుగా పందేలు మొదలయ్యాయని సమాచారం. ఇక పెద్ద బరుల నిర్వాహకులు బోగి కోసం ఎదురు చూస్తున్నారు. బరులకు కావాల్సిన టెంట్లు, కర్రలు, అంగబలాన్ని సిద్ధం చేసుకొనే పనిలో బిజీ అయిపోయారు. జిల్లాలో కొన్ని కత్తుల తయారీ కేంద్రాల వారు సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ని ఇప్పటికే పైకంతో ప్రసన్నం చేసుకున్నారనే వాదన వినవస్తోంది. దీంతో ఉన్నతాధికారులు ఎంత కాలు దువ్వుతున్నా కంచే చేను మేయడంతో చేష్టలుడిగి చూడడం తప్ప చేసేదేమీ ఉండడం లేదు.ఇక్కడ ప్రత్యేకించి పోలీసు నిఘా ఏమైందనే వాదన బలంగా వినిపిస్తోంది.

నడిపేది వైసీపీ నాయకులే!

కోడి పందేల బరుల నిర్వహణలో వైసీపీ నాయకుల పేర్లే వినిపిస్తున్నాయి.మూడు రోజుల్లో కోట్లాది రూపాయలు జేబు లో పడే అవకాశం ఉండడంతో ఈ జూద క్రీడను దగ్గరుండి ఆడిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో ‘మీకు అందా ల్సింది అందుతుంది.. మీరు అటువైపు రావొద్దు’ అనే హెచ్చ రికలు ఇప్పటికే వెళ్లాయని చెబుతున్నారు. ఇప్పటికే కోడి పం దేల వద్ద అనుబంధ జూదాలైన గుండాట, పేకాట, మూడు ముక్కలాట, బోర్డులు, మాంసాహార, బిర్యానీ, కూల్‌డ్రింక్స్‌ తదితర స్టాల్స్‌ నిమిత్తం అడ్వాన్సులూ పుచ్చు కున్నారని గతేడాది వేమగిరి జంక్షను దగ్గర్లోని జాతీయ రహదారి పక్కనే పెద్ద పెద్ద టెంట్లు వేసి పెద్ద బరి నిర్వహించారు. జీపులో వచ్చి ప్రాంగణం చుట్టూ ఓ రౌండు వేసి వెళ్లే విధు లను పోలీసులు నిర్వర్తించారు. ఈ బరి ఏర్పాటు చేసినవాళ్లు నగరానికి చెందిన ఓ వైసీపీ నేత అనుంగులు కావడం గమనార్హం. దీంతో ఇప్పుడూ అధికార బలం పోలీసుల కళ్లకు గంతలు కడుతుందనే వాదన వినిపి స్తోంది.

గోకవరంలో 500 కత్తులు పట్టివేత

గోకవరం, జనవరి 11 : కోడి పందేలు నిర్వహణ కు కోడి కత్తులు తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తు లను గోకవరం పోలీసులు అరెస్టు చేసి 500ల కోడి కత్తులు స్వాధీనం ఎస్‌.ఐ యు.శివ నాగబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ముందుగా అందిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ జగదీష్‌ ఆదేశాల మేరుకు నార్త్‌ జోన్‌ డీఎస్పీ కిషోర్‌ కుమార్‌ పర్యవేక్షణలో స్పెషల్‌ బ్రాంచ్‌ సిబ్బంది సహాయంతో దాడులు చేశామన్నారు. మండలంలోని వీరంద్ర కాలనీ సమీపంలో కోడి కత్తులు తయారు చేస్తుండగా ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరొ ఇద్దరు పరారయ్యారు.వీరి నుంచి 233 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. వెలమపేటలో కోడి కత్తులు తయారు చేస్తుండగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని 277 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌.ఐ చెప్పారు. మండలంలో కోడి పందాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.

100 కత్తులు స్వాధీనం

పెరవలి, జనవరి 11 : సంక్రాంతికి కోడిపందాలు నిర్వహించే వారిపై చర్యలు తప్పవని ఎస్‌ఐ సూర్యభగ వాన్‌ హెచ్చరించారు. పెరవలి మండలం నడిపల్లి కోటకు చెందిన వీరమల్లు రామకృష్ణ వద్ద 40 కోడి కత్తులు, ఉండ్రాజవరం మండలం తాడిపర్రుకు చెందిన నందమూరి వెంకటేశ్వరరావు వద్ద 60 కోడి కత్తులు సీజ్‌ చేసి వారి ఇరువురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. జిల్లా ఎస్పీ జగదీశ్‌, కొవ్వూరు డీఎస్‌పీ వర్మ ఆదేశాలు మేరకు నిడదవోలు సీఐ ఆధ్వ ర్యంలో గురువారందాడులు చేసినట్టు తెలిపారు.

Updated Date - Jan 12 , 2024 | 12:53 AM