ప్రతి ఓటుపైనా అవగాహన ఉండాలి
ABN , Publish Date - Feb 06 , 2024 | 01:07 AM
నియోజకవర్గంలోని ప్రతి ఓటుపైనా టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల సంఘం నిర్వహించిన ఓటరు సవరణ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగక పోవడంతో ఓటరు జాబితా అస్తవ్యస్తంగా మారిందని, ఓటరు జాబితాపై నాయకులు దృష్టి సారించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి
క్లస్టర్, బూత్ ఇన్‌చార్జులకు సమగ్ర శిక్షణ తరగతులు
అనపర్తి, ఫిబ్రవరి 5: నియోజకవర్గంలోని ప్రతి ఓటుపైనా టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల సంఘం నిర్వహించిన ఓటరు సవరణ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగక పోవడంతో ఓటరు జాబితా అస్తవ్యస్తంగా మారిందని, ఓటరు జాబితాపై నాయకులు దృష్టి సారించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం అనపర్తిలోని ఎస్‌ఎన్‌ఆర్ కల్యాణ మండపంలో నిర్వహించి ఇంటిగ్రేటెడ్ శిక్షణా తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఇప్పటికే ఎన్నికలు సమీపించాయని, ప్రతిఒక్కరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే ఎన్నికల సమయానికి పని ఒత్తిడి తగ్గుతుందన్నారు. అలాగే గ్రామాల్లో నాయకులు ప్రతి ఓటరును కలిసి వైసీపీ అవినీతి పాలనను వివరిస్తూ టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు చేరువచేసి ఓటు అడగాలన్నారు. వచ్చే 60 రోజులు ఎంతో కీలకమని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని క్లస్టర్ ఇన్‌చార్జులు, బూత్ ఇన్‌చార్జులుతో బాటు ఆళ్ల గోవిందు, జుత్తుగ కృష్ణ, వెలుగుబంటి సత్తిబాబు, తమలంపూడి సుధాకరరెడ్డి, సత్తి దేవదానరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, నల్లమిల్లి సుబ్బారెడ్డి, ఒంటిమి సూర్యప్రకాష్, మామిడిశెట్టి శ్రీను పాల్గొన్నారు.