కాకినాడ జిల్లా డీఈవోగా పి.రమేష్
ABN , Publish Date - Feb 07 , 2024 | 01:39 AM
కాకినాడ జిల్లా డీఈవోగా పి.రమేష్
ప్రకాశం జిల్లా డీఈవోగా దాట్ల సుభద్ర
కాకినాడ రూరల్, ఫిబ్రవరి 6: కాకినాడ జిల్లా డీఈవోగా పిల్లి రమేష్‌ను బదిలీచేస్తూ పాఠశాల విద్య ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. రమేష్ ప్రకాశంజిల్లా డీఈవోగా పనిచేసి పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉండగా కాకినాడ డీఈవోగా పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పటివరకూ పాఠశాల విద్య జోన్-2 ఆర్జేడీ జి.నాగమణి కాకినాడ జిల్లా ఇన్‌చార్జ్ డీఈవోగా బాధ్యతలు నిర్వహించారు. అదేవిదంగా కాకినాడ జిల్లా పిఠాపురం డీవైఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న దాట్ల సుభద్రకు పదోన్నతి కల్పించి ప్రకాశం జిల్లా డీఈవోగా బదిలీచేశారు.