Share News

ఇన్‌స్టాగ్రామ్‌ వివాదం.. వివాహిత కిడ్నాప్‌

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:24 AM

ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన వివాదం కారణంగా ఒక వివాహితను ముగ్గురు మహిళలు కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించి పోలీసు లకు చిక్కారు.

ఇన్‌స్టాగ్రామ్‌ వివాదం.. వివాహిత కిడ్నాప్‌

అరగంటలోనే పట్టుకున్న పోలీసులు

గోకవరం, ఫిబ్రవరి 19 : ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన వివాదం కారణంగా ఒక వివాహితను ముగ్గురు మహిళలు కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించి పోలీసు లకు చిక్కారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని చిట్టీలవారివీధికి చెందిన వీరమళ్ళ సునీతను కొవ్వూ రుకు చెందిన ఇద్దరు మహిళలు, గోకవరానికి చెందిన మరో మహిళ కిడ్నాప్‌ చేసేందుకు సోమవారం మధ్యా హ్నం పన్నాగం పన్నారు. పఽథకం ప్రకారం ఐ ట్వంటీ కారులో సునీత ఇంటి వద్ద ముందుగా గస్తీ నిర్వ హించారు.ఆ సమయంలో సునీత ఇంటి వద్ద లేకపోవ డంతో ఆమె ఇంటికి వచ్చే వరకు అక్కడే కారులో కాపుకాచారు.ఇదిలా ఉండగా సునీత సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో బయట నుంచి ఇంటికి రావడాన్ని సదరు ముగ్గురు మహిళలు గుర్తిం చారు. వెంటనే కారు నుంచి ఆ ముగ్గురు మహిళలు సునీత ఇంటికెళ్లి ఆమెను బలవంతంగా ఈడ్చు కుంటూ కారులోకి ఎక్కించి అక్కడ నుంచి పరార య్యారు.అడ్డొచ్చిన కుటుంబీకులను పక్కకు గెం టేశా రు.దీంతో బాధిత కుటుంబీకులు షాక్‌కు గురయ్యారు. కొంత సేపటికి తేరుకున్న సునీత భర్త దేవీ వరప్ర సాద్‌ హుటాహుటిన వెళ్లి ఎస్‌ఐ నాగరాజుకు సమా చారం అందించారు. ఎస్‌ఐ నాగరాజు తన సిబ్బందిని వెంటనే అప్రమత్తం చేశారు. వివాహిత సునీతను కిడ్నాప్‌ చేసి తీసుకెళుతున్న నిందితుల కారు కోసం రెండు రూట్లలో అన్వేషణ ఆరంభించారు. చివరకు గోకవరం నుంచి తంటికొండ వెళ్లే రోడ్డులో కారును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్‌కు యత్నించిన ముగ్గురు మహిళలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.కారును స్వాధీనం చేసుకున్నారు. కిడ్నా ప్‌కు గురైన సునీతను బంధువులకు అప్పగించారు. బాధితులు మధ్యాహ్నం 3 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేయగా 3.30 గంటలకే కేసును చేధించారు. దీంతో బాధిత కుటుంబీకులు ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - Feb 20 , 2024 | 12:24 AM