Share News

కాతేరు గామన్‌ బ్రిడ్జి రోడ్డులో అర్ధరాత్రి బ్లేడ్‌ బ్యాచ్‌ల ఆగడాలు

ABN , Publish Date - May 24 , 2024 | 01:23 AM

రాజమహేంద్రవరం రూరల్‌ మం డలం కాతేరు గ్రామం శివారు గామన్‌ బ్రిడ్జి రోడ్డులో అర్థరాత్రి దాటాక బ్లేడు బ్యాచ్‌ల ఆగడాలు మితిమీరుతున్నాయి.

కాతేరు గామన్‌ బ్రిడ్జి రోడ్డులో   అర్ధరాత్రి బ్లేడ్‌ బ్యాచ్‌ల ఆగడాలు

హిజ్రాల వేషధారణలో దందాలు

రాజమహేంద్రవరం రూరల్‌, మే 23: రాజమహేంద్రవరం రూరల్‌ మం డలం కాతేరు గ్రామం శివారు గామన్‌ బ్రిడ్జి రోడ్డులో అర్థరాత్రి దాటాక బ్లేడు బ్యాచ్‌ల ఆగడాలు మితిమీరుతున్నాయి. గత కొద్ది రోజులుగా కొన్ని బ్యాచ్‌లు గామన్‌ బ్రిడ్జి దిగువన గోదావరిగట్టు వద్దకు చేరి అర్ధరాత్రి దాటాక మద్యం మత్తులో రోడ్డుపైకి వచ్చి అటుగా వెళ్లే వాహనాలకు అడ్డంగా నిలబడి దందా లు చేస్తున్నారు. బ్లేడులు, కత్తులు, బీరు సీసాలు చేతపట్టుకుని భయానక వాతవరణాన్ని సృష్టిస్తున్నాయి. గత అర్ధరాత్రి ఈ బ్యాచ్‌లలో రెండువర్గాలకు గొడవలు జరగ్గా రోడ్డుపై రాడ్‌లతో కొట్టుకుని దారుణంగా వ్యహరించారని అటుగా లారీలో వెళ్లిన ఒక డ్రైవర్‌ తెలిపారు. లారీ ఆపి కిందకు దిగితే దాడి చేస్తారనే భయపడి ఆపకుండా వెళ్లిపోయినట్టు ఆ డ్రైవర్‌ చెప్పాడు. కొంతమంది యువకులు హిజ్రాల వేషధారణలో తిరుగుతున్నట్లుగా కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాతేరు గ్రామంలో మెయిన్‌ రోడ్డు, మల్లయ్యపేట, గణపతినగర్‌, ఆనంద్‌నగర్‌ రోడ్డు, శాంతినగర్‌ రోడ్డు ప్రాంతాల్లో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి దాటాక బైక్‌లు, స్కూటీలు వేసుకుని ఇనుప రాడ్‌లు, బ్లేడ్‌లు పట్టుకుని మత్తులో తిరుగుతున్నారని వారిని ఎవరని నిలదీస్తేనే దాడి చేసేలా ఉండటంతో స్థానిక ప్రజలు కూడా బయటకు రాని పరిస్థితులు ఉన్నాయి. మత్తులో బ్లేడ్‌బ్యాచ్‌లు, హిజ్రాల వేషధారణతో కొంతమంది, బైక్‌లు దొంగతనాలు చేసేందుకు మరికొంత మంది గ్రామంలో తిరగడంతో ఇబ్బం

Updated Date - May 24 , 2024 | 07:18 AM