Share News

కాపులకు 75 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలి

ABN , Publish Date - Jan 14 , 2024 | 01:41 AM

రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో కాపులకు 75 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్‌ స్థానాలు కేటాయించాలని కాపునాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ తాడివాక రమేష్‌నా యుడు డిమాండ్‌ చేశారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాపులకు 75 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలి

కాపునాడు జాతీయ అధ్యక్షుడు రమేష్‌నాయుడు

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 13: రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో కాపులకు 75 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్‌ స్థానాలు కేటాయించాలని కాపునాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ తాడివాక రమేష్‌నా యుడు డిమాండ్‌ చేశారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపుల జనాభా దామాషా 27 శాతం ప్రకారం అన్ని రాజకీయపార్టీలు సీట్లు కేటాయించాలని, నామినేటెడ్‌ పోస్టులతో పాటు అన్నిరంగాల్లో ప్రాతినిధ్యం కల్పించే రాజకీయ పార్టీలకే తమ మద్దుతు ఉంటుందన్నారు. రాజ్యాధికారంలో వాటా పొందడంతో పాటు రెండేళ్లు పవర్‌ షేరింగ్‌ విధానంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టి తీరాలని డిమాండ్‌ చేశారు. కాపునాడు రాష్ట్ర కన్వీనర్‌ సిద్దా శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్‌ ఎవ్వరితో పొత్తుపెట్టుకున్నా అభ్యంతరంలేదుకానీ అంతి మంగా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 6 అసెంబ్లీ స్థానాలు, 1 ఎంపీ స్థానాన్ని, ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాలో 7 అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ స్థానాన్ని, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్క పార్లమెంట్‌, 5 అసెంబ్లీ స్థానాలు, రాయలసీమలో 5 అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ స్థానాన్ని కాపులకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. త్వరలోనే కాపునాడు పొలిటికల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుచేసి తిరుపతి కేంద్రంగా కార్యాచరణ చేసేందుకు చర్చలు ప్రారంభిస్తున్నామన్నారు. సమావేశంలో కాపునాడు నాయకులు పెదిరెడ్డి మహేష్‌, వంగా ఆంజనేయులు, నల్లమిల్లి సత్యనారాయణ, వి.శ్రీదేవి, గంటా దివాకర్‌, జేటీ రామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 06:52 AM