Share News

చెక్కు చెదరని చరిత్ర

ABN , Publish Date - Dec 12 , 2024 | 12:46 AM

ఇప్పుడు రాజ్యాలు లేవు. వలస పాలకులూ లేరు. వీరికి, ప్రజలకు అనుసంధానంగా కొనసా గిన జమిందారీ వ్యవస్థా నేడు లేదు. కానీ జమిందారీ వ్యవస్థ నాటి వైభవానికి సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. జమిందార్లు లేకపోయినా వారు నివసించిన దివాణాలు ఉన్నాయి. వారి వారసుల సంరక్షణలో జమిందారులు వి

చెక్కు చెదరని చరిత్ర
దివాణం కోట

కపిలేశ్వరపురం జమిందారీ సంస్థానానికి వందల ఏళ్ల చరిత్ర

దివాణం నిర్మాణానికి 144 ఏళ్లు

ఇప్పటికీ అదే రాజసంతో దర్శనమిస్తున్న ఎస్టేట్‌

అలనాటి జ్ఞాపకాలుగా ఫర్నిచర్‌, ఇతర సామగ్రి

(ఆంధ్రజ్యోతి- మండపేట)

ఇప్పుడు రాజ్యాలు లేవు. వలస పాలకులూ లేరు. వీరికి, ప్రజలకు అనుసంధానంగా కొనసా గిన జమిందారీ వ్యవస్థా నేడు లేదు. కానీ జమిందారీ వ్యవస్థ నాటి వైభవానికి సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. జమిందార్లు లేకపోయినా వారు నివసించిన దివాణాలు ఉన్నాయి. వారి వారసుల సంరక్షణలో జమిందారులు వినియో గించిన వస్తు సామగ్రి ఇప్పటికీ చెక్కు చెదర కుండా ఉన్నాయి. ఒక్కొక్క జమిందారీ దివాణం ఒక్కో చరిత్ర. కపిలేశ్వరపురం జమిందారీ దివా ణం కూడా అందులో ఒకటి. డాక్టర్‌ బీఆర్‌ అం బేడ్కర్‌ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మం డలం కపిలేశ్వరపురం గ్రామంలో జమిందార్‌ కుటుంబానికి సంబంధించిన దివాణం భవ నాలు నేటికీ పదిలంగానే ఉన్నాయి. 1880లో నిర్మించిన దివాణం భవనాలు ఆనాటి నిర్మాణం పనితనం, నైపుణ్యానికి ఆనవాళ్లుగా నిలుస్తు న్నాయి. ఇక్కడ జమిందార్‌ దివాణం గోదావరి నది చెంతనే ఉంది. సాధారణంగా జమిందార్లు అంటే మొత్తంగా భూయజమాన్య హక్కులు కలిగినవారు. అభివృద్ధిలోను, రైతుల నుంచి పన్నుల వసూళ్లలోను కీలక భూమిక వహించే వారు. అలాగే సాహిత్య, సాంస్కృతిక కళలకు రాజపోషకులు. కపిలేశ్వరపురం జమిందార్లు కూడా తమ హయాంలో సాంస్కృతిక వైభవా నికి పునాదులు వేశారు. వాటిలో భాగమే వేద పాఠశాల, హరికథ పాఠశాలలు ప్రారంభమై నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కపిలేశ్వరపు రం ఎస్టేట్‌కు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఎస్టేట్‌ను సంపాదించిన బలుసు వంశీయులు, 1635లో దుర్జయ వంశస్తులు కాకతీయ రాజ సంతతికి చెందిన శ్రీబలుసు నాగినీడు తొలి జమిందార్‌గా వ్యవహరించారని పూర్వపు చరి త్ర చెబుతోంది. ఆ తర్వాతకాలంలో బ్రిటీష్‌ పా లనలో ఆంగ్లేయుల నుంచి 1818లో బలుసు పెద సర్వారాయుడు ఈ జమీ పొందారు. కపిలే శ్వరపురం జమీలో ఆరు శివారు లంకలు ఉండే వి. 1847లో పెదసర్వారాయుడు చనిపోగా, ఆయన కొడుకు బుచ్చి కృష్ణయ్య పాలనకొచ్చా రు. ఆయన 1852లో ఆరు గ్రామాలు ఉన్న కేశ నకుర్రు సంస్థానాన్ని రాజా దంతులూరి బుచ్చి కృష్ణంరాజు నుంచి కొనుగోలు చేసి విస్తరించా రు. ఎన్నో ప్రజా కార్యక్రమాలు చేపట్టారు. బు చ్చి కృష్ణయ్య 1857లో చనిపోయారు. తర్వాత జమిందార్‌ అయిన ఆయన సోదరుడు పట్టా భిరామయ్య 1866లో చనిపోయారు. ఆయన భార్య రామలక్ష్మమ్మ తన పాలనలో పెద్ద సత్రం నిర్మించి అనేక సేవా కార్యక్రమాల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆమె దత్తపుత్రుడు పట్టాభిరామయ్య 1896లో చనిపోగా, మరో ఇద్దరి సంరక్షించింది. 1906లో ఈమె చనిపోగా, బలుసు బుచ్చిసర్వారాయుడు జమిందార్‌ అయ్యారు. ఈయన 1913లో పెద్ద పాఠశాల నిర్మించి జిల్లా బోర్డుకు అప్పగించారు. ఆంగ్లే యుల ఇంపీరియల్‌ వ్యవసాయ పరిశోధనా సంఘానికి సభ్యుడు. చాగంటి శేషయ్య గారి రాధామాధవము, ఆంధ్ర కవితరంగిణి, సుగ్రీవ విజయము అనే గ్రంథాలను ముద్రింపజేశారు. జిల్లా బోర్డు అధ్యక్షుడిగానూ పనిచేశా రు. హసనాబాద్‌ గ్రామాన్ని సంపాదించారు. 1945లో బ్రిటిష్‌ ప్రభుత్వం ఈయనకు రావు బహుద్దూర్‌ బిరుదు నిచ్చింది. ఈ బలుసు బుచ్చి సర్వారాయుడు, లక్ష్మీ వెం కట సుబ్బామ్మారావు దంపతుల కుమారులు ఎస్‌బీ ప్రభాకర పట్టాభిరామారావు, ప్రభాకర వెంకట రామ్మోహ నరావు, ప్రభాకర వెంకట చలపతి రావు, ఎస్‌బీపీబీకే సత్యనారాయణ రావు (చంటి దొర). వీరిలో ప్రభా కర రామ్మోహనరావు మద్రాసులో చదువుకుంటుండగా 17 ఏట మర ణించారు. వీరిలో పట్టాభిరామారా వు, సత్య నారాయణరావులు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో మంత్రు లుగా పని చేశారు. ఇద్దరూ కేంద్ర సహాయ మంత్రులుగా పనిచేయడం విశే షం. చలపతిరావు వ్యాపార రంగంలో రాణించారు. ఎంతో వైభవాన్ని పదిలపర్చు కున్న కపిలేశ్వరపురం దివాణంలో నిర్మించిన భవనానికి 144 ఏళ్లు. ఇది 1880లో నిర్మిం చారు. అయినప్పటికీ ఇప్పటికీ రాజసానికి చిహ్నలుగా నిలిచే ఉన్నాయి. భవనాలే కాకుండా ఫర్నిచర్‌, వారు వినియోగించిన వస్తువులు అపురూపమైన సంపదగా నిలుస్తున్నాయి. ఆనాటి నిర్మాణాలు అప్పటి వారి నైపు ణ్యానికి సాక్షీభూతంగా దర్శనమిస్తున్నాయి. ఈ జమిం దారీ సంస్థానం మిగిలిన జమిందారీ వ్యవస్థలకన్నా భిన్నం. ఇది ప్రజలతో మమేకమైన సేవా సౌధం.

Updated Date - Dec 12 , 2024 | 12:46 AM