Share News

కండువా వేసిన రోజే జగన్‌ కనబడతారు

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:52 AM

వైసీపీ వాడుకుని వదిలేసే రకం...కండువా వేసిన రోజునే మనకు కనబడతారు. తరువాత వైసీపీకి అడ్డం వచ్చిన వారిని, ఇది తప్పు అని చెప్పినా సంబంధిత వ్యక్తులను ఏదోరకంగా వారిని పార్టీ నుంచి బయటకు పంపించేస్తారు.

కండువా వేసిన రోజే   జగన్‌ కనబడతారు

జగన్మోహన్‌రెడ్డి కాదు...ఆయన బటన్‌ రెడ్డి

రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమే: నటుడు పృఽథ్వీరాజ్‌

పి.గన్నవరం, ఏప్రిల్‌ 21: వైసీపీ వాడుకుని వదిలేసే రకం...కండువా వేసిన రోజునే మనకు కనబడతారు. తరువాత వైసీపీకి అడ్డం వచ్చిన వారిని, ఇది తప్పు అని చెప్పినా సంబంధిత వ్యక్తులను ఏదోరకంగా వారిని పార్టీ నుంచి బయటకు పంపించేస్తారు. ఇది వైసీపీ జగన్‌ నైజం అంటూ నటుడు, జనసేన నాయకుడు పృధ్వీరాజ్‌ వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పి.గన్నవరం జనసే న పార్టీ కార్యాలయంలో కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ, స్థానిక కూటమి నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు దోచుకో దాచుకో అన్న నినాదంతో పని చేశారని మండిప డ్డారు. సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తారని అసత్య ప్రసారాలు చేస్తున్నారని కౌలు రైతులకు సైతం పవన్‌కళ్యాణ్‌ తన సొంత డబ్బు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అవసరమైతే పది రూపాయలు పెంచి మరీ సంక్షేమ పథకాలు ఇస్తామని కూటమి నేతలు చెబుతున్నారని ఆయన స్పష్టం చేశారు. జగన్‌ అనే వ్యక్తి వీధికి ఒకడు ఉంటే పవన్‌కళ్యాణ్‌ అనే వ్యక్తి రాష్ట్రానికి ఒక్కడే ఉంటాడన్నారు. సిద్ధం అంటూ తిరుగుతూ ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని మనం యుద్ధం అంటూ గెలవడానికి యుద్ధం చేస్తున్నా మన్నారు. ఇక రాష్ట్రంలో వారి ఆటలు సాగవని ఉమ్మడి మేనిఫెస్టోతో వస్తున్న కూటమిదే విజయమని టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం అవుతారని ఆయన జోస్యం చెప్పారు. శ్రీవాణీ ట్రస్టు పేరుతో తిరుమలను అవినీతిమయం చేశారని దోపిడీదారులు, దుర్మార్గులు చేరిపోయారన్నారు. కూటమిలో భాగంగా అన్ని పార్టీల ఓట్లు కూటమి అభ్యర్థికి బదిలీకావాలని ఆదిశగా పనిచేయాలని ఆయ న పిలుపునిచ్చారు. మెగాస్టార్‌ చిరంజీవీ ఎన్‌డీఏ కూటమికి మద్దతు పలకడం ఆనందంగాఉందని త్వరలో ఆయన ప్రచారానికి వచ్చే అవకాశం ఉందన్నారు.

కాపు నాయకుడు కాదు..రెడ్డి సేవకుడు

ముద్రగడ కాపు నాయుకుడు కాదని రెడ్డి సేవకుడని నటుడు పృధ్విరాజ్‌ ఫైర్‌ అయ్యారు. వైసీపీ వారు వాడుకుని వదిలేస్తారని ముద్రగడకు అర్ధం కావడంలేదన్నారు. సినిమా నటుల్ని తరిమికొట్టాలని ముద్రగడ వ్యాఖ్యానిస్తు న్నారని అన్న ఎన్టీఆర్‌ హాయాంలో ఆయన మంత్రిగా పనిచెయ్యలేదా అని ఆయన ప్రశ్నించారు. అన్ని కులాల వారు అసెంబ్లీకి వెళ్తేనే సమస్యలు పరిష్కా రమవుతాయన్నారు. ఆ సమావేశంలో ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మీ, సంసాని పెద్దిరాజు, సాధనాల శ్రీవెంకట సత్యనారాయణ, తోలేటి సత్తిబాబు, శిరిగినీడి వెంకటేశ్వరావు, వాసంశెట్టి కుమార్‌, గణపతి రాఘవులు పాల్గొన్నారు.

అంబటిని సంక్రాంతి సంబరాలకు పిలుద్దాం

ఎన్నికల్లో అంబటి ఎలాగో ఓడిపోతారు. రాబోయే సంక్రాంతి సంబరాలకు, కోడిపందెలకు కోనసీమకు పిలుద్దాం. భోగిమంటలు చుట్టూ తిరిగి డ్యాన్స్‌ చేసి పోతారు. మాజీ మంత్రి కదా..ఒకో లక్ష ఇప్పిద్దాం. మనవారికి చెబితే బుక్‌ చేస్తారు.

Updated Date - Apr 22 , 2024 | 12:52 AM