Share News

పీడీ కార్యాలయం ముట్టడించిన యానిమేటర్లు

ABN , Publish Date - Jan 06 , 2024 | 12:19 AM

కాకినాడ సిటీ, జనవరి 5: రాజకీయ కారణాలతో అక్రమంగా తొలగించిన వీవోఏ (యానిమేటర్ల) ను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కాకినాడ డీఆర్డీవో పీడీ కార్యాలయాన్ని సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం వీవోఏలు ముట్టడించారు. ఈ సందర్భంగా ఏ వీ వెలుగు వీవోఏ ఉద్యోగుల సం ఘం నాయకురా

పీడీ కార్యాలయం ముట్టడించిన యానిమేటర్లు

కాకినాడ సిటీ, జనవరి 5: రాజకీయ కారణాలతో అక్రమంగా తొలగించిన వీవోఏ (యానిమేటర్ల) ను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కాకినాడ డీఆర్డీవో పీడీ కార్యాలయాన్ని సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం వీవోఏలు ముట్టడించారు. ఈ సందర్భంగా ఏ వీ వెలుగు వీవోఏ ఉద్యోగుల సం ఘం నాయకురాలు కె.గంగాభవాని, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి మాట్లాడారు. గత నాలుగేళ్ల లో అనేకసార్లు పీడీ కార్యాలయంలో వీవోఏల సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చినా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదన్నారు. సమస్యలను పట్టించు కోకపోతే ఇదే పీడీ కార్యాలయం వద్ద ఈనెల 6వ నుంచి రిలే నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించా రు. తొలుత త్రీటౌన్‌ సీఐ చర్చల మే రకు వెలుగు అధికారులను కార్యా లయం లోపలికి అనుమతించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు మేరీ, సీఐటీయూ జిల్లా నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, దుమ్ముల మేరీ, సాధనాల పద్మ, కె.ఈశ్వరి భాయ్‌, ఎం.రామలక్ష్మి, కె.సత్యవేణి, ఎన్‌.దేవి నాయకత్వం వహించారు.

Updated Date - Jan 06 , 2024 | 12:19 AM