Share News

‘ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించాలి’

ABN , Publish Date - May 26 , 2024 | 12:27 AM

వేళంగి (కరప), మే 25: ఇంటింటా సర్వే చేసి ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించాలని ఎస్‌ఎస్‌ఐఈ జిల్లా కో-ఆర్డినేటర్‌ చామ ంతి నాగేశ్వరరావు సూచించారు. వేళంగిలో శనివారం ఆయన ఎంఈవో పత్తి సత్యనారాయణతో కలిసి ఐఈఆర్‌పీలు కన్నె స్వాతి, నురుకుర్తి మల్లేశ్వరి నిర్వహిస్తున్న ఇంటింటా సర్వేను పరిశీలించి

‘ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించాలి’

వేళంగి (కరప), మే 25: ఇంటింటా సర్వే చేసి ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించాలని ఎస్‌ఎస్‌ఐఈ జిల్లా కో-ఆర్డినేటర్‌ చామ ంతి నాగేశ్వరరావు సూచించారు. వేళంగిలో శనివారం ఆయన ఎంఈవో పత్తి సత్యనారాయణతో కలిసి ఐఈఆర్‌పీలు కన్నె స్వాతి, నురుకుర్తి మల్లేశ్వరి నిర్వహిస్తున్న ఇంటింటా సర్వేను పరిశీలించి పలు సూచనలు జారీచేశారు. గ్రామంలో మచ్చ వివేక్‌, తేజ అనే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులతో చర్చించారు. జిల్లాలో 0-18 ఏళ్లు కలిగిన ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఐఈఆర్‌పీలు క్షేత్రస్థాయిలో సర్వే చేసి ప్రత్యేకావసరాలు కలిగిన పిల్లలు, వారి తల్లిదండ్రుల సమస్త వివరాలు సేకరించాలని సూచించారు.

Updated Date - May 26 , 2024 | 12:27 AM