Share News

ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేందుకు సహకరించాలి

ABN , Publish Date - May 21 , 2024 | 11:40 PM

జగ్గంపేట, మే 21: ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ కోరారు. మంగళవా రం మధ్యాహ్నం జగ్గంపేటలోని శివపార్వతి ఫంక్షన్‌ హాల్‌ నందు జగ్గంపేట నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులతో

ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేందుకు సహకరించాలి
జగ్గంపేట సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ

జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌

జగ్గంపేట, మే 21: ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ కోరారు. మంగళవా రం మధ్యాహ్నం జగ్గంపేటలోని శివపార్వతి ఫంక్షన్‌ హాల్‌ నందు జగ్గంపేట నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులతో ఎంతో చక్కగా సహకరించారన్నారు. అదే సహకారం కౌంటింగ్‌ నాడు, కౌంటింగ్‌ తర్వాత సహకారం అందజేయాలని కోరారు. ఎటువంటి అల్లర్లు, హింసాత్మక ఘటనలకు పాల్పడరాదన్నారు. గొడవలకు పా ల్పడి అనవసరంగా కేసులలో ఇరుక్కోవద్దన్నారు. ముఖ్యంగా కౌంటింగ్‌ ముగిశాక విజయోత్సవ ర్యాలీ లు నిర్వహించాలంటే ముందుగా పోలీసులు అను మతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని కోరారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్‌ అధికారి నవజ్యోతి మిత్ర, పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి, జగ్గంపేట సీఐ లక్ష్మణరావు, ఎస్‌ఐ నాగార్జున, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్‌ శాఖ పటిష్టమైన చర్యలు

ప్రత్తిపాడు, మే 21: జిల్లాలో జూన్‌4న సార్వత్రిక ఎన్నికలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనంతరం శాంతిభద్రతలకు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు సహకరించాలని ఎస్పీ సతీష్‌కుమార్‌ కోరారు. ప్రత్తిపాడు సరయు ఫంక్షన్‌ హాల్లో నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల సమావేశం మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఈనెల 13న జరిగిన ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో జరిగిన గొడవలు కారణంగా పో లీస్‌ శాఖ పటిష్టమైన చర్యలు చేపడుతుందన్నారు. జూన్‌4న ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా పోలీస్‌ శాఖ తీసుకునే ముందు జాగ్రత్త చర్యలకు అన్ని రాజకీయ పార్టీల వారు సహకరించాలన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలీస్‌ శాఖ తీసుకునే విధానాలు వ్యతిరేకించిన వారిపై చట్టబద్దమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో మే 13న పోలి ంగ్‌ ప్రశాంతంగా జరిగిందని రాజకీయ పార్టీల ప్రతినిధులను అభినందించారు. జూన్‌4న కౌంటింగ్‌ సజావుగా శాంతిభద్రతలతో విఘాతం లేకుండా జరిగేలా చూడాలని కోరారు. పెద్దాపురం డీఎస్పీ కె.లతాకుమారి, ట్రైనీ డీఎస్పీ నవజ్యోతి మిత్ర, సీఐ ఎం.శేఖర్‌బాబు, ఎస్‌ఐలు పవన్‌కుమార్‌, సతీష్‌, కిషోర్‌, నబీ, రాజకీయ నాయకులు కొమ్ముల కన్నబాబు, వరుపుల తమ్మయ్యబాబు, వరుపుల సూరిబాబు, ఉమ్మిడి వెంకట్రావు, నీరుకొండ సత్యనారాయణ, ధర్నాల కోట శ్రీను,మానుకొండ లచ్చబాబు ఉన్నారు.

Updated Date - May 21 , 2024 | 11:40 PM