Share News

ఎన్నికల కౌంటింగ్‌, ఫలితాల ప్రక్రియ సజావుగా సాగాలి

ABN , Publish Date - May 23 , 2024 | 12:01 AM

కాకినాడ క్రైం, మే 22: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌, ఫలితాల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఎస్పీ సుబ్రమణి సతీష్‌కుమార్‌ కోరారు. జూన్‌ 4న జరగబోయే ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లే కుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఆ

ఎన్నికల కౌంటింగ్‌, ఫలితాల ప్రక్రియ సజావుగా సాగాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించం: ఎస్పీ

కాకినాడ క్రైం, మే 22: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌, ఫలితాల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఎస్పీ సుబ్రమణి సతీష్‌కుమార్‌ కోరారు. జూన్‌ 4న జరగబోయే ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లే కుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన కాకినాడ సూర్యకళామందిరంలో బుధవారం వివిధ రాజకీ య పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ జూన్‌ 6వతేదీ వరకు ఎన్నికల కోడ్‌, 144 సెక్షన్‌, సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌లు అమలులో ఉన్నందున ప్రజలు ఎవరూ కూడా నలుగురికి మించి ఒక చోట గుంపుగా చేరరాదన్నారు. కౌంటింగ్‌ రోజు అనవసరంగా రోడ్లు మీదికి వచ్చి గొడవలకు కారకులై క్రిమినల్‌ కేసుల్లో ఇరు క్కోవద్దని హితవు పలికారు. ముఖ్యంగా ఇతరులను కించపరిచే వ్యాఖ్యలు చేసి కవ్వింపు చర్యలకు పాల్పడడం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పా ల్పడితే జిల్లా పోలీస్‌శాఖ ఉపేక్షించబోదని ఎస్పీ హెచ్చరించారు. అని రాజకీ య పార్టీల నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలన్నారు. ముంద స్తు అనుమతులు లేకుండా ఊరేగింపులు, ర్యాలీలు చేయరాదన్నారు. జూన్‌ 6 వరకు నమోదయ్యే క్రిమినల్‌ కేసులన్నింటిని ప్రత్యేకంగా పరిగణించి ఎన్నికల కమిషన్‌ పర్యవేక్షణలో ఆయా కేసులు అన్నింటిలో శిక్షలు పడేలా ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కాకినాడ సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ అధికారి డాక్టర్‌ కె.హనుమంతురావు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2024 | 12:01 AM