Share News

ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌ కమాండెంట్‌గా సతీష్‌కుమార్‌

ABN , Publish Date - Jan 31 , 2024 | 11:42 PM

సర్పవరం జంక్షన్‌, జనవరి 31: కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌ కమాండెంట్‌గా జిల్లా ఎస్పీ ఎస్‌.సతీష్‌కుమార్‌ని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం

ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌ కమాండెంట్‌గా సతీష్‌కుమార్‌

సర్పవరం జంక్షన్‌, జనవరి 31: కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌ కమాండెంట్‌గా జిల్లా ఎస్పీ ఎస్‌.సతీష్‌కుమార్‌ని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 29న ప్రభుత్వం పలువురు ఐ పీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తొలుత ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌ కమాండెంట్‌గా కర్నూలు సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ కృష్ణకాంత్‌ పాటిల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2రోజులకే మళ్లీ కృష్ణకాంత్‌ పాటిల్‌ని విజయవాడ లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌కు అదపు బాధ్యతలు అప్పగిస్తూ నియమించారు.

Updated Date - Jan 31 , 2024 | 11:42 PM