Share News

అధికారంలోకి వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమే

ABN , Publish Date - Mar 27 , 2024 | 11:43 PM

సర్పవరం జంక్షన్‌, మార్చి 27: సీఎం జగన్‌ నియంతృత్వ పాలన, ప్రజావ్యతిరేఖ విధానాలతో ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి రాబోయేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనని కాకినాడ రూరల్‌ ఉమ్మడి అభ్యర్థి పంతం నానా జీ అన్నారు. బుధవారం జనసే

అధికారంలోకి వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమే
కరప: జనసేనలో చేరినవారితో నానాజీ

కాకినాడ రూరల్‌ అభ్యర్థి పంతం నానాజీ

సర్పవరం జంక్షన్‌, మార్చి 27: సీఎం జగన్‌ నియంతృత్వ పాలన, ప్రజావ్యతిరేఖ విధానాలతో ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి రాబోయేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనని కాకినాడ రూరల్‌ ఉమ్మడి అభ్యర్థి పంతం నానా జీ అన్నారు. బుధవారం జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు రెడ్డిపల్లి కిషోర్‌, లచ్చబాబుల ఆధ్వర్యంలో కొవ్వాడకు చెందిన వైసీపీ సీనియర్‌ నాయకులు ఎస్కే భాషా, ఎస్కే ఆలీలతో పాటూ పలువురు మాజీ వార్డు సభ్యులు గొడారిగుంట లో జనసేన పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు వేసి నానాజీ సాదరంగా ఆహ్వానించారు.

జనసేనలో పలువురి చేరిక

కరప, మార్చి 27: రజక సంఘం మండల ఉపాధ్యక్షుడు సైనవరపు భవానీశంకర్‌ ఆధ్వర్యం లో జనసేన నాయకుడు యాళ్ల వీరవెంకటసత్యనారాయణ సమక్షంలో మండలానికి చెందిన 50మంది తటస్తులు పంతం నానాజీని కలవగా కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. జనసేనపార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బోగిరెడ్డి గంగాధర్‌, నాయకులు బోగిరెడ్డి కొండలరావు, పేపకాయల పవన్‌కుమార్‌ తదితరులున్నారు.

జనసేనలోకి రమేష్‌

జగ్గంపేట రూరల్‌, మా ర్చి 27: జనసేన పార్టీలోకి తుమ్మలపల్లి రమేష్‌ ఈ నెల 30న పిఠాపురంలో పవన్‌ సమక్షంలో చేరనున్న ట్లు పార్టీ అధికారికంగా వె ల్లడించింది. మంగళగిరిలో పవన్‌కల్యాణ్‌ను తమ్ములపల్లి రమేష్‌ కలిశారు.

Updated Date - Mar 27 , 2024 | 11:43 PM