కూటమి అధికారంలోకి వచ్చేందుకు మద్దతివ్వాలి
ABN , Publish Date - May 12 , 2024 | 12:13 AM
కాకినాడ రూరల్, మే 11: రాష్ట్రం అభివృద్ధి, ప్రజాశ్రేయస్సు దృష్ట్యా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేందుకు మద్దతు ఇవ్వాలని కాకినాడ రూరల్ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) కోరారు. శనివారం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ క్రీడా మైదానం, జేఎన్టీయూ

కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ
కాకినాడ రూరల్, మే 11: రాష్ట్రం అభివృద్ధి, ప్రజాశ్రేయస్సు దృష్ట్యా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేందుకు మద్దతు ఇవ్వాలని కాకినాడ రూరల్ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) కోరారు. శనివారం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ క్రీడా మైదానం, జేఎన్టీయూకే క్రీడామైదానాల్లో వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల జగన్ పాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నా రు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుందన్నారు. సమర్థవంతమైన పాలన కోసం చంద్రబాబు, పవన్, బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం చారిత్రక అవసరమన్నారు. ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే క్రీడామైదానాల్లో వాకర్స్ సంక్షేమం కోసం పలు మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. గాజుగ్లాసు గుర్తుపై ఓట్లేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌లను అత్యధిక మెజారీటీతో గెలిపించాలని ఆయన కోరారు. అ నంతరం కాకినాడ అర్భన్ డివిజన్‌లో ప్రచారం నిర్వహించారు.
జనసేనలో 50 మంది చేరిక
కాకినాడ రూరల్ సూర్యారావుపేటకు చెందిన జనసేన నాయకుడు చిన్న ఆధ్వర్యంలో 50 మంది వైసీపీ కార్యకర్తలు శుక్రవారం వలసపాకల పార్టీ కార్యాలయంలో జనసేనలో చేరారు. వీరికి కాకినాడ రూరల్ అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలి
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బాధ్యత కలిగిన ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని జనసేన కూటమి కాకినాడ రూరల్ అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) పిలుపునిచ్చారు. శుక్రవారం వలసపాకల గంగరాజునగర్‌లో పార్టీ కార్యాలయం లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్ల వైసీపీ పాలన బేరీజు వేసుకుని ప్రజలకు మంచి చేయాలనే తలంపుతో ఏర్పడిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వానికి మద్దతివ్వాలని కోరారు. ఈవీఎం మిషన్‌లో ఓటు వేసే విషయంపై అవగాహన కల్పించారు. కూటమికి మద్దతు ఇచ్చే వాళ్లంతా ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ విజయం కోసం గాజుగ్లాసు గుర్తుపై బటన్ నొక్కాలని ఆయన కోరారు.