Share News

అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా

ABN , Publish Date - May 11 , 2024 | 12:57 AM

సర్పవరం జంక్షన్‌, మే 10: ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు చరమగీతం పాడాలని, ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని కాకినాడ రూరల్‌ జనసేన కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గొడారిగుంట నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలతో కలసి కార్పొరేషన్‌ 47, 48వ డివిజన్‌లో ఎన్నికల రోడ్డు షో ప్రచారం నిర్వహించారు. ఎస్‌.అచ్యుతాపు

అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా
అచ్యుతాపురంలో ప్రచారం నిర్వహిస్తున్న నానాజీ

కాకినాడ రూరల్‌ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నానాజీ

సర్పవరం జంక్షన్‌, మే 10: ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు చరమగీతం పాడాలని, ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని కాకినాడ రూరల్‌ జనసేన కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గొడారిగుంట నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలతో కలసి కార్పొరేషన్‌ 47, 48వ డివిజన్‌లో ఎన్నికల రోడ్డు షో ప్రచారం నిర్వహించారు. ఎస్‌.అచ్యుతాపురంలో టీడీపీ జిల్లా ఎస్సీ సెల్‌ అధ్య క్షులు కొల్లాబత్తుల అప్పారావు, కోనాల కృష్ణ ఆధ్వర్యంలో నానాజీకి ఘన స్వాగతం పలికారు. చీడిగ, ఇంద్రపాలెం, కొవ్వాడ, తూరంగి, కరప మండలం పెద్దాప్పురపాడు, యండమూరు, విజయరాయుడుపాలెం తదితర గ్రామాల్లో రోడ్డు షో, ముఖ్యమైన కూడళ్ల వద్ద ప్రచారం నిర్వహించి జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుకు ఓట్లేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీ గా ఉదయ్‌శ్రీనివాస్‌ని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకుందామని, ఒక్క ఛాన్సంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిలువునా ముంచారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, కోఆర్డినేటర్‌ పిల్లి సత్యనారాయణమూర్తి, కూటమి నాయకులు కటకంశెట్టి ప్రభాకర్‌ (బాబీ),నులుకుర్తి వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి ఏసుదాసు, పెంకే శ్రీనివాస బాబా, రాందేవు సీతయ్యదొర పాల్గొన్నారు. 47వ డివజన్‌లో టీడీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కొల్లాబత్తుల అప్పారావు ఆ ధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నానాజీ మాట్లాడారు.

నానాజీకి మద్దతుగా ప్రచారం

కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యేగా జనసేన కూటమి అభ్యర్థి పంతం నానాజీ, ఎంపీగా ఉదయ శ్రీనివాస్‌లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిసత్యనారాయణమూర్తి దంపతులు శుక్రవారం రాత్రి ఇంద్రపాలెంలో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పంతం నానాజీ, తంగెళ్ల శ్రీనివాస్‌కు మద్దతుగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుణ్ణం చంద్రమౌళి ఆధ్వర్యంలో భారీ బైక్‌, వాహన ర్యాలీ నానాజీ కుమారుడు పంతం సందీప్‌తో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్టీవో ఆఫీసు రోడ్డు నుంచి బయలు దేరిన ప్రచారం అర్బన్‌ పరిధిలోని 7డివిజన్లు, రమణయ్యపేట, ఇంద్రపాలెం, తూరంగి, చీడిగ, తిమ్మాపురం, సూర్యారావుపేటతో పాటూ కరప మండలంలో సాగింది. కార్యక్రమంలో యువ నాయకుడు రుత్విక్‌ తదితరులున్నారు.

కూటమికే మా మద్దతు

గొల్లప్రోలు రూరల్‌, మే 10: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులకే తమ మద్దతు ఉంటుందని గాండ్ల తెనుకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెబ్బిలి రవికుమార్‌ తెలిపారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో శుక్రవారం జరిగిన గాండ్ల తెనుకుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గాండ్ల తెనుకుల కులస్థులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని, చిన్నతరహా నూనె మిల్లులకు ఉచితంగా కరెంటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశా రు. సమావేశంలో జనసేన ఉపాధ్యక్షుడు మహేంద్రరెడ్డి, జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి, జ్యోతుల శ్రీనివాస్‌, చిత్రాడ సత్యనారాయణ, అయినవిల్లి చల్లారావు, చిన్న, చిత్రాడ రామకృష్ణ, కందా శ్రీనివాస్‌, గాండ్ల తెనుకుల కులస్థులు తదితరులు ఉన్నారు.

Updated Date - May 11 , 2024 | 12:57 AM